దేశవ్యాప్తంగా విజయ దశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయ దశమి రోజున పలు ప్రాంతాల్లో రావణుని దిష్టిబొమ్మను దహనం చేసి, చెడుపై మంచి విజయం సాధించిందనే సందేశాన్ని అందిస్తారు. రావణ దహన వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగే ‘లవకుశ రామ్‌లీల’ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈసారి విజయ దశమి వేడుకల్లో ఓ మహిళ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయనుంది. ఇది రామ్‌లీల చరిత్రలో కొత్త అధ్యాయమని పలువురు చెబుతున్నారు.
లవకుశ రామ్‌లీలలో రావణుని దహనం చేసేది మరెవరో కాదు నటి కంగనా రనౌత్. కంగన తదుపరి చిత్రం తేజస్‌పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కంగనా రనౌత్ ఢిల్లీలోని లవకుశ రామ్‌లీలలో రావణ దహనానికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. వీడియోలో కంగనా రనౌత్ తాను రావణ దహనం చేయడానికి ఢిల్లీకి వస్తున్నట్లు తెలిపారు.
ఈ వీడియోలో నటి తన తేజస్ సినిమాను కూడా ప్రమోట్ చేశారు. ‘ఎర్రకోటలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమ 50 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయడం ఇదే మొదటిసారి. జై శ్రీరామ్’ అని కంగన క్యాప్షన్‌లో రాశారు. కంగనా రనౌత్‌కి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంగన రనౌత్ నటించిన తేజస్ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment