న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీరాముడు లంకాధిపతి రావణుని సంహరించాడు. అందుకే దసరా నాడు రావణుని దిష్టిబొమ్మను దహనం చేస్తారు.
దేశరాజధాని ఢిల్లీలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. దసరా రోజున రావణ దహనంతో పాటు పలు చోట్ల మేళాలు నిర్వహిస్తారు. ఈ మేళాలలో రావణుడు, కుంభకరుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.
రామ్‌లీలా మైదాన్
ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే రావణ దహన కార్యక్రమాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలివస్తుంటారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుని భారీ దిష్టి బొమ్మలను తయారు చేసి, వాటిని దహనం చేస్తారు. ఇక్కడి జరిగే మేళాలో రకరకాల వంటకాలు, వినోదాల కోసం పలు స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగే రావణ దహనాన్ని దూరదర్శన్‌లో ప్ర్యత్యక్ష ప్రసారం చేస్తారు. న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి రామ్‌లీలా మైదాన్‌కు చేరుకోవచ్చు.
ఎర్రకోట
ప్రతి సంవత్సరం ఎర్రకోటలో దసరా సందర్భంగా మేళా నిర్వహిస్తారు. అనేకమంది కుటుంబ సమేతంగా ఎర్రకోటకు తరలివచ్చి, దసరా వేడుకలను తిలకిస్తారు. మేళా సందర్భంగా ఇక్కడ పలు షాపింగ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.
గీతా కాలనీ
నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ఇక్కడ పెద్దఎత్తున మేళా నిర్వహిస్తారు. చాలామంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడికి తరలివచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఫుడ్ స్టాల్స్‌లో ఆహరం తినడాన్ని చాలామంది ఇష్టపడతారు.
రోహిణి- జనక్‌పురి
ఢిల్లీలోని రోహిణి- జనక్‌పురిలో జరిగే ఈ జాతరను సెక్టార్ 11 ఫెయిర్ అని అంటారు. ఇక్కడ దసరా మేళా భారీ స్థాయిలో జరుగుతుంది. పిల్లల కోసం ఇక్కడ లెక్కకు మించిన స్టాల్స్ ఏర్పాటు చేస్తారు.
ఇది కూడా చదవండి: షిర్డీ సాయి ట్రస్టుకు పన్ను మినహాయింపు సబబే
Comments
Please login to add a commentAdd a comment