Viral Video: Ravan Dahan Fire Back AT People UP Muzaffarnagar On Dussehra - Sakshi
Sakshi News home page

Ravan Dahan: బెడిసి కొట్టిన రావణ దహనం.. ఆపై ఎద్దు వీరంగం.. వీడియో వైరల్‌

Published Thu, Oct 6 2022 11:48 AM | Last Updated on Thu, Oct 6 2022 12:27 PM

Viral Video: Ravan Dahan Fire Back AT People UP Muzaffarnagar - Sakshi

లక్నో(యూపీ): ముజఫర్‌నగర్‌లో జరిగిన రావణ దహన కార్యక్రమం బెడిసి కొట్టింది. దిష్టి బొమ్మ నుంచి బాణాసంచా జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో అంతా పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. 

బుధవారం సాయంత్రం ముజఫర్‌నగర్‌ ప్రభుత్వ ఇంటర్‌ కళాశాల మైదానంలో రావణ దహన కార్యక్రం ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి వందల మంది చేరుకున్నారు. అయితే.. దహనం అనంతరం దిష్టిబొమ్మ నుంచి బాణాసంచా మిస్సైళ్ల మాదిరి దూసుకురావడంతో ప్రజలతో పాటు పోలీసులు పరుగులు తీశారు. అయితే ఇది ఇక్కడితోనే ఆగలేదు. 

బాణాసంచా తర్వాత.. ఒక ఎద్దు మైదానంలో వీరంగం సృష్టించింది. దీంతో జనాలు తలోవైపు పరుగులు తీశారు. చివరకు అధికారులు ఆ ఎద్దును ఎలాగోలా లొంగదీసుకుని.. పక్కకు తీసుకెళ్లారు. 

Video Credits: TNNavbharat

హర్యానాలోని యమునా నగర్‌లోనూ ఇదే తరహాలో ఘటన జరిగింది. రావణ దహనం తర్వాత దిష్టిబొమ్మ జనాల వైపుగా పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement