గురుగ్రామ్: ఎనిమిది మంది యువకుల చేసిన కారు స్టంట్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురగ్రామ్‌లో సుమారు అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఎనిమిది మంది యువకు మూడు కార్లతో మద్యం దుకాణం వద్ద రాత్రి 2 గంటల సమయంలో కారుతో స్టంట్స్ చేశారు.
ఆ ఎనిమిది మంది మారుతి ఎర్టిగా, హ్యుందాయ్ వెన్యూ, హ్యందాయ్ క్రెటా అనే మూడు కార్లతో స్టంట్‌లు చేశారు. తొలుత సౌరభ అనే వ్యక్తి తన కారుతో స్టంట్ చేశాడు. తదనంతరం రెండు స్టంట్‌లో మద్యం దుకాణం వెలుపల ఉన్న ముగ్గురు వ్యక్తులన ఘోరంగా ఢీ కొట్టాడు. దీంతో 50 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తుల తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మేరకు పోలీసులు నిందితులు సౌరభ్ శర్మ అలియాస్ సాయిబీ, రాహుల్, రవి సింగ్ అలియాస్ రవీందర్, వికాస్ అలియాస్ విక్కీ, మోహిత్, ముకుల్ సోని, లవ్‌లుగా గుర్తించి అరెస్టు చేయగా, అశోక్ అనే మరో నిందితుడిని సాయంత్రం అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు సోదరులని, వారంతా మద్యం సేవించి ఈ స్టంట్‌లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ ఉన్న సీసీఫుటేజ్ తనిఖీ చేయగా సుమారు 10 నుంచి 12 మంది యువకులు మద్యం దుకాణం ముందు కార్లతో విన్యాసాలు చేయడం కనిపించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
#Gurugram में मौत की स्टंटबाज़ी, Wine Shop के बाहर स्टंट करते हुए तीन लोगों को मारी टक्कर एक बेगुनाह की मौत @gurgaonpolice pic.twitter.com/edZYWDB39e
— Sunil K Yadav 🇮🇳 (@SunilYadavRao) November 7, 2022
(చదవండి: గుట్కా తినండి, మందు తాగండి.. సేవ్ వాటర్!: బీజేపీ ఎంపీ కామెంట్ల దుమారం)
Comments
Please login to add a commentAdd a comment