సరదా కోసమే బాటిళ్లు విసిరారు: ధోనీ | MS Dhoni says barring a few, spectators throw bottles just for fun | Sakshi
Sakshi News home page

సరదా కోసమే బాటిళ్లు విసిరారు: ధోనీ

Published Tue, Oct 6 2015 10:44 AM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

సరదా కోసమే బాటిళ్లు విసిరారు: ధోనీ

సరదా కోసమే బాటిళ్లు విసిరారు: ధోనీ

కటక్ టి-20 మ్యాచ్లో భారత్ బ్యాట్స్మెన్ విఫలమైనందుకు స్టేడియంలోని ప్రేక్షకులు వాటర్ బాటిళ్లు విసిరి రచ్చ చేయడాన్ని మీడియా, క్రీడా రంగాలు తప్పుపట్టాయి. అయితే టీమిండియా కెప్టెన్ ధోనీ మాత్రం ఈ సంఘటనను తేలిగ్గా తీసుకున్నాడు.  

కటక్లో ప్రేక్షకుల తీరు వల్ల ఆటగాళ్ల భద్రతకు హానీ కలగలేదని, ఈ సంఘటనను  సీరియస్గా తీసుకోరాదని అన్నాడు. సరదా కోసమే ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరారంటూ తేలికపరిచే ప్రయత్నం చేశాడు. గతంలో వైజాగ్లో ఓ మ్యాచ్ను అలవోకగా గెలిచినప్పుడు కూడా ప్రేక్షకులు ఇలాగే బాటిళ్లు విసిరారని ధోనీ చెప్పాడు. సరదా కోసమే ఇలా చేశారని, ఇలాంటి ఘటనలను సీరియస్ గా పరిగణించరాదని అన్నాడు. దక్షిణాఫ్రికాతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 92 పరుగులకు ఆలౌట్ కావడంతో ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరి అంతరాయం కలిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement