'ఫ్రెంచ్ ఓపెన్'లో వీక్షకులకు గాయాలు | steel sheet falls into crowd at french open | Sakshi
Sakshi News home page

'ఫ్రెంచ్ ఓపెన్'లో వీక్షకులకు గాయాలు

Published Wed, Jun 3 2015 12:20 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

'ఫ్రెంచ్ ఓపెన్'లో వీక్షకులకు గాయాలు

'ఫ్రెంచ్ ఓపెన్'లో వీక్షకులకు గాయాలు

పారిస్: ఫిలిప్ చాట్రియర్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో ముగ్గురు వీక్షకులు గాయపడ్డారు. ఈదురు గాలుల ధాటికి స్కోర్ బోర్డుకు అమర్చిఉన్న స్టీల్ షీటు జనసమూహంపై ఊడిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.

ఘటనలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని, చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించామని నిర్వాహకులు ప్రకటించారు. కాగా, ఈ మ్యాచ్లో ఫ్రెంచ్ ఆటగాడు సోంగా.. జపాన్ ప్లేయర్ నిషికోరిపై విజయం సాధించి సెమీస్లోకి ప్రవేశించాడు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్కు అర్హత సాధించడం సోంగాకు ఇది రెండోసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement