
పారిస్ : ఈ నెల 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగే టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు బెర్నార్డ్ సోమవారం స్పష్టం చేశారు. దాంతో కరోనా విరామం అనంతరం ప్రేక్షకులతో జరగనున్న తొలి మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్‌గా ఫ్రెంచ్ ఓపెన్ నిలవనుంది. తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం పారిస్ వంటి నగరాల్లో 5 వేల మందితో కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఇది సాధ్యమైంది. (తన కోపమే తన శత్రువు)
ఫ్రెంచ్ ఓపెన్ పూర్తి సామర్థ్యంలో 50 నుంచి 60 శాతం వీక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే ఇంచుమించుగా టోర్నీ జరుగుతున్న రోజుల్లో రోజుకు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టోర్నీకి వేదికయ్యే ప్రదేశాన్ని మూడు జోన్లుగా విభజించారు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. టోర్నీలో ఆడేందుకు వచ్చిన ప్లేయర్లకు 72 గంటల వ్యవధిలో రెండు సార్లు కరోనా పరీక్షలు చేస్తామని రెండు సార్లు నెగెటివ్ అని వస్తేనే వారిని టోర్నీలో ఆడేందుకు అనుమతిస్తామని టోర్నీ డైరెక్టర్ గయ్ ఫోర్జె తెలిపారు. (ఒలింపిక్స్ జరగడం ఖాయం: ఐఓసీ)
Comments
Please login to add a commentAdd a comment