న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా టీనేజ్ స్టార్, ఆరో సీడ్ కోకో గాఫ్ తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 67 నిమిషాల్లో 6–0, 6–2తో 20వ సీడ్ ఒస్టాపెంకో(లాతి్వయా)పై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్,
స్వియాటెక్‌ను బోల్తా కొట్టించినా..
ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించిన 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకో క్వార్టర్ ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. గాఫ్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఒస్టాపెంకో 36 అనవసర తప్పిదాలు చేసింది.
మరో క్వార్టర్ ఫైనల్లో కరోలినా ముకోవా.. సిరెస్టియాను మట్టికరిపించి తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్), 12వ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
Karolina Muchova, are you kidding!?
— US Open Tennis (@usopen) September 6, 2023
What a get! pic.twitter.com/MOUmzt3YMn
Novak Djokovic refuses to be defeated in #USOpen quarterfinals. pic.twitter.com/MKdhLmUCMU
— US Open Tennis (@usopen) September 5, 2023
What a match point from @CocoGauff❗️
— US Open Tennis (@usopen) September 5, 2023
How it sounded on #USOpen radio 🎙️⤵️ pic.twitter.com/m4DGbBkk1A
Comments
Please login to add a commentAdd a comment