కెరీర్‌లో ఎనిమిదో సింగిల్స్ టైటిల్ నెగ్గిన అమెరికా టెన్నిస్ స్టార్
రూ. 9 కోట్ల 24 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
బీజింగ్: అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ ఈ ఏడాది రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నీలో ప్రపంచ ఆరో ర్యాంకర్ కోకో గాఫ్ చాంపియన్‌గా అవతరించింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కోకో గాఫ్ 6–1, 6–3తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. 76 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో కోకో ఆరు ఏస్‌లు సంధించింది. ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.
విజేతగా నిలిచిన కోకో గాఫ్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ముకోవాకు 5,85,000 డాలర్ల (రూ. 4 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో గత 14 ఏళ్లలో ఈ టోర్నీ టైటిల్ సాధించిన పిన్న వయసు్కరాలిగా 20 ఏళ్ల కోకో గాఫ్ గుర్తింపు పొందింది.
సెరెనా విలియమ్స్ (2004, 2013) తర్వాత చైనా ఓపెన్ సాధించిన రెండో అమెరికన్ ప్లేయర్‌గానూ కోకో గాఫ్ ఘనత వహించింది. ఓవరాల్‌గా కోకో కెరీర్‌లో ఇది ఎనిమిదో సింగిల్స్ టైటిల్. తాజా టైటిల్‌తో సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత సాధించేందుకు కోకో గాఫ్ చేరువైంది.
Comments
Please login to add a commentAdd a comment