యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం.. టైటిల్‌ విజేతగా 19 ఏళ్ల కోకో గాఫ్‌ | US Open 2023: Coco Gauff wins maiden Grand Slam title | Sakshi
Sakshi News home page

US Open 2023: యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం.. టైటిల్‌ విజేతగా 19 ఏళ్ల కోకో గాఫ్‌

Published Sun, Sep 10 2023 7:37 AM | Last Updated on Sun, Sep 10 2023 7:44 AM

US Open 2023: Coco Gauff wins maiden Grand Slam title  - Sakshi

యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌ విజేతగా అమెరికా టీనేజర్‌ కోకో గాఫ్‌ నిలిచింది. శనివారం జరిగిన  ఫైనల్‌లో బెలారస్‌కు చెందిన సెకెండ్‌ సీడ్‌ అరీనా సబలెంకాను ఓడించి తొలి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను గాఫ్‌ కైవసం చేసుకుంది.  2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని 2-6, 6-3, 6-2 తేడాతో 19 ఏళ్ల కోకో గాఫ్‌  ఓడించింది.

తొలి సెట్‌లో కోకో గాఫ్‌ ఓటమి పాలైనప్పటికీ.. ఆ తర్వాతి రెండు సెట్లలో తిరిగి పుంజుకుని ప్రత్యర్థిని మట్టికరిపించింది.  ఇక చాంపియన్‌గా నిలిచిన  గాఫ్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది. సెరెనా విలిమమ్స్‌ తర్వాత యూఎస్‌ ఓపెన్‌ ట్రోఫీని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా గౌఫ్ నిలిచింది.

చదవండి: దాయాదుల పోరుకు రంగం సిద్ధం.. ఆటనా... వర్షమా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement