యూఎస్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ విజేతగా బెలారస్ స్టార్ అరీనా సబలెంక నిలిచింది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన పెగులాపై 7-5, 7-5 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంక గెలుపొందింది.
దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ తుది పోరులో తీవ్రంగా శ్రమించిన సబలెంక.. తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. పెగులా నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి సబెలంక మాత్రం తన పట్టును కోల్పోలేదు.
కాగా సబలెంక గత యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ తుది మెట్టుపై బోల్తా పడింది. కోకో గాఫ్ చేతిలో ఓటమిపాలైంది. కానీ ఈసారి మాత్రం ఈ బెలారస్ స్టార్ తన కలను నేరవేర్చుకుంది. 26 ఏళ్ల అరీనా ట్రోఫీని అందుకున్న వెంటనే కోర్టుంతా తిరుగుతూ సంబరాలు చేసుకుంది. అదే విధంగా సబెలెంక ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్.
Comments
Please login to add a commentAdd a comment