కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ అందుకోవాలనే లక్ష్యంతో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆరో సీడ్ కోకో గాఫ్ 6–4, 7–5తో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై... సబలెంకా 0–6, 7–6 (7/1), 7–6 (10/5)తో 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలుపొందారు. భారత కాలమానం ప్రకారం నేడు అర్ధరాత్రి దాటాక గం. 1:30 నుంచి ఫైనల్ జరుగుతుంది.
ముకోవాతో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల కోకో గాఫ్ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. 2017 యూఎస్ ఓపెన్ రన్నరప్ కీస్‌తో 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా తొలి సెట్‌లో ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయింది. రెండో గేమ్‌లో ఒకదశలో ఆమె 4–5తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది.
తొమ్మిదో గేమ్‌లో కీస్ తన సర్విస్‌ను నిలబెట్టుకొని ఉంటే విజయం అందుకునేది. కానీ కీస్ సర్విస్‌ను సబలెంకా బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసి మ్యాచ్‌లో నిలిచింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్‌లో సబలెంకా 2–4తో వెనుకబడింది. ఈసారీ తేరుకొని స్కోరును 4–4తో సమం చేసింది. చివరకు టైబ్రేక్‌లోనూ ఆధిపత్యం కనబరిచి విజయాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment