న్యూయార్క్: సొంతగడ్డపై అమెరికా టీనేజ్ స్టార్ కోకో గాఫ్ మెరిసింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో 19 ఏళ్ల గాఫ్ 6–3, 6–2తో మిరా ఆంద్రీవా (రష్యా)పై గెలిచింది. 76 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గాఫ్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచింది.
మరోవైపు ఏడో సీడ్ గార్సియా (ఫ్రాన్స్), 2000, 2001 చాంపియన్ వీనస్ విలియమ్స్ (అమెరికా), 12వ సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. గార్సియా 4–6, 1–6తో యఫాన్ వాంగ్ (చైనా) చేతిలో, వీనస్ 1–6, 1–6తో గ్రీట్ మినెన్ (బెల్జియం) చేతిలో, క్రిచికోవా 4–6, 6–7 (3/7)తో లూసియా బ్రోన్‌జెట్టి (ఇటలీ) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్), ఆరో సీడ్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్‌లోకి చేరారు.
Comments
Please login to add a commentAdd a comment