third round
-
కోకో జోరు
న్యూయార్క్: స్వదేశంలో తన జోరు కొనసాగిస్తూ... అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నలో మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ టోరీ్నలో అడుగుపెట్టిన మూడో సీడ్ కోకో గాఫ్ రెండో రౌండ్లో 6–4, 6–0తో ప్రపంచ 99వ ర్యాంకర్ తాత్యానా మరియా (జర్మనీ)పై గెలిచింది. 80 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కోకో గాఫ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 28 సార్లు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు నెగ్గిన కోకో 25 విన్నర్స్ కొట్టింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో లూసియా బ్రోన్జెట్టి (ఇటలీ)పై, మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 6–1, 6–4తో క్లారా బురెల్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) వరుసగా మూడో ఏడాది మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. రెండో రౌండ్లో కిన్వెన్ జెంగ్ 6–7 (3/7), 6–1, 6–2తో ఎరికా ఆంద్రీవా (రష్యా)ను ఓడించింది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో 12వ సీడ్ దరియా కసత్కినా (రష్యా) 1–6, 6–7 (3/7)తో పేటన్ స్టెర్న్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. జొకోవిచ్ ముందుకు... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) మూడో రౌండ్‌కు చేరుకున్నారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జొకోవిచ్ 6–4, 6–4, 2–0తో లాస్లో జెరె (సెర్బియా)పై, జ్వెరెవ్ 6–4, 7–6 (7/5), 6–1తో ముల్లర్ (ఫ్రాన్స్)పై, రూడ్ 6–4, 6–2, 2–6, 7–6 (7/3)తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. జెరెతో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి రెండు సెట్లు గెలిచి, మూడో సెట్లో 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా జెరె వైదొలిగాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 4–6, 5–7, 6–1, 6–2, 6–2తో రిండర్నీచ్ (ఫ్రాన్స్)పై, 13వ సీడ్ షెల్టన్ (అమెరికా) 6–3, 6–4, 6–4తో అగుట్ (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–1, 6–1, 7–6 (7/4)తో హిజికాటా (ఆ్రస్టేలియా)పై గెలిచారు. -
మూడో రౌండ్లో జొకోవిచ్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మాజీ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 5–7, 7–5తో జేకబ్ ఫెర్న్లె (బ్రిటన్) పై గెలుపొందాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) 3 గంటల 42 నిమిషాల్లో 7–6 (7/3), 7–6 (7/4), 2–6, 7–6 (7/4)తో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 4–6, 7–6 (9/7), 1–6తో జిన్యు వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా); యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీలు తొలి రౌండ్లో నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాయి. -
జొకోవిచ్ అలవోకగా...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వరుసగా 19వ ఏడాది మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఈ సెర్బియా దిగ్గజం 6–4, 6–1, 6–2తో రొబెర్టో కార్బెలస్ బేనా (స్పెయిన్)పై విజయం సాధించాడు. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ 43 విన్నర్స్ కొట్టడంతోపాటు నెట్ వద్ద 20 పాయింట్లు సాధించాడు. మరోవైపు నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ హుర్కాజ్ (పోలాండ్) కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ 7–6 (7/4), 6–2, 6–2తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై, హుర్కాజ్ 6–7 (2/7), 6–1, 6–3, 7–6 (7/5)తో నకíÙమా (అమెరికా)పై గెలుపొందారు. కెచ్‌మనోవిచ్ (సెర్బియా)తో జరిగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్ తొలి సెట్‌ను 6–1తో నెగ్గి, రెండో సెట్లో 5–0తో ఆధిక్యంలో ఉన్నపుడు కెచ్‌మనోవిచ్ గాయం కారణంగా వైదొలిగాడు. సబలెంకా ముందుకు... మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సబలెంకా 6–2, 6–2తో ఉచిజిమా (జపాన్)పై, రిబాకినా 6–3, 6–4తో అరంటా రుస్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 7–6 (7/1), 1–6, 7–5తో నయోమి ఒసాకా (జపాన్)పై, మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–3, 6–4తో తమారా జిదాన్సెక్ (స్లొవేనియా)పై నెగ్గారు. -
కోకో గాఫ్ అలవోకగా...
న్యూయార్క్: సొంతగడ్డపై అమెరికా టీనేజ్ స్టార్ కోకో గాఫ్ మెరిసింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 19 ఏళ్ల గాఫ్ 6–3, 6–2తో మిరా ఆంద్రీవా (రష్యా)పై గెలిచింది. 76 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గాఫ్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు ఏడో సీడ్ గార్సియా (ఫ్రాన్స్), 2000, 2001 చాంపియన్ వీనస్ విలియమ్స్ (అమెరికా), 12వ సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. గార్సియా 4–6, 1–6తో యఫాన్ వాంగ్ (చైనా) చేతిలో, వీనస్ 1–6, 1–6తో గ్రీట్ మినెన్ (బెల్జియం) చేతిలో, క్రిచికోవా 4–6, 6–7 (3/7)తో లూసియా బ్రోన్జెట్టి (ఇటలీ) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్), ఆరో సీడ్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్లోకి చేరారు. -
మూడో రౌండ్లో అంకిత రైనా
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా మూడో రౌండ్లోకి ప్రవేశించింది. న్యూయార్క్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ 182వ ర్యాంకర్ అంకిత 6–4, 6–3తో ప్రపంచ 114వ ర్యాంకర్ అలియోనా బొల్సోవా (స్పెయిన్)పై గెలిచింది. -
US Open 2022: ఎదురులేని నాదల్
న్యూయార్క్: తొలి రెండు రౌండ్లలో విజయం సాధించేందుకు చెమటోడ్చిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మూడో రౌండ్లో మాత్రం రఫ్ఫాడించాడు. తన చిరకాల ప్రత్యర్థి రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై మరోసారి సంపూర్ణ ఆధిపత్యం చలాయించి అతనిపై వరుసగా 18వ విజయం సాధించాడు. తద్వారా టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో నాదల్ 11వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 91వ ర్యాంకర్ రిచర్డ్ గాస్కేతో జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్ 6–0, 6–1, 7–5తో అలవోకగా గెలుపొందాడు. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన నాదల్ 24 సార్లు నెట్ వద్దకు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికా ప్లేయర్ ఫ్రాన్సిస్కో టియాఫోతో ఆడతాడు. మూడో రౌండ్లో టియాఫో 7–6 (9/7), 6–4, 6–4తో 14వ సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)పై విజయం సాధించాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–3, 6–3తో జెన్సన్ బ్రూక్స్‌బై (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 2–6, 6–7 (3/7), 6–4, 7–6 (10/7)తో షపోవలోవ్ (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. స్వియాటెక్ ముందంజ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మూడో రౌండ్లో స్వియాటెక్ 6–3, 6–4తో లౌరెన్ డేవిస్ (అమెరికా)పై నెగ్గింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 6–2, 6–7 (6/8), 6–0తో యు యువాన్ (చైనా)పై, డానియెలా కొలిన్స్ (అమెరికా) 6–4, 7–6 (11/9)తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై, పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 5–7, 6–3, 7–6 (12/10)తో తొమ్మిదో సీడ్ ముగురుజా (స్పెయిన్)పై, అజరెంకా (బెలారస్) 6–3, 6–0తో పెట్రా మార్టిక్ (క్రొయేషియా)పై, కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 5–7, 6–4, 6–3తో 13వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. -
బార్టీకి షెల్బీ షాక్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆదివారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. సొంత ప్రేక్షకుల నడుమ అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్ అద్భుత ఆటతీరుతో యాష్లే బార్టీని బోల్తా కొట్టించింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 43వ ర్యాం కర్ షెల్బీ రోజర్స్ 6–2, 1–6, 7–6 (7/5)తో యాష్లే బార్టీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిచింది. నిర్ణాయక మూడో సెట్లో షెల్బీ 2–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఎనిమిదో గేమ్‌లో బార్టీ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని ఉంటే విజయాన్ని దక్కించుకునేది. కానీ షెల్బీ ధాటికి బార్టీ తొలుత ఎనిమిదో గేమ్‌లో, ఆ తర్వాత పదో గేమ్‌లో తన సరీ్వస్‌లను కోల్పోయింది. వరుసగా రెండు బ్రేక్ పాయింట్లు సాధించిన షెల్బీ స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సరీ్వస్‌లను కాపాడుకోవడంతో చివరి సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. టైబ్రేక్‌లో 4–5తో వెనుకబడిన షెల్బీ వరుసగా మూడు పాయింట్లు గెలిచి బార్టీ కథ ముగించింది. ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసిన బార్టీ తగిన మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్ ఫైనల్లో స్వితోలినా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–3తో 12వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. జొకోవిచ్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలోనూ సంచలన ఫలితం నమోదైంది. ఏడో సీడ్ షపోవలోవ్ (కెనడా) ఓటమి చవిచూడగా... టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. లాయిడ్ హ్యారిస్ (దక్షిణాఫ్రికా) 6–4, 6–4, 6–4తో షపోవలోవ్‌ను ఓడించగా... టాప్ సీడ్ జొకోవిచ్ 6–7 (4/7), 6–3, 6–3, 6–2తో నిషికోరి (జపాన్)పై, జ్వెరెవ్ 3–6, 6–2, 6–3, 6–1తో జాక్ సోక్ (అమెరికా)పై విజయం సాధించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేíÙయా) జోడీ 6–3, 4–6, 6–4తో హుగో నిస్ (మొనాకో) –రిండెర్క్నిచ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. -
మూడో రౌండ్లో హరికృష్ణ
సోచి (రష్యా): ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణతోపాటు భారత్‌కే చెందిన ఆధిబన్, ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో హరికృష్ణ 1.5–0.5తో యాసిర్ పెరెజ్ క్యూసాడా (క్యూబా)పై, ఆధిబన్ 2–0తో న్యూరిస్ డెల్గాడో రమిరెజ్ (పరాగ్వే)పై, ప్రజ్ఞానంద 2–0తో గాబ్రియెల్ సర్గాసియన్ (అర్మేనియా)పై, నిహాల్ 1.5–0.5తో సనన్ జుగిరోవ్ (రష్యా)పై గెలిచారు. నిర్ణీత రెండు గేమ్‌లు ముగిశాక విదిత్ (భారత్)–అలెగ్జాండర్ ఫియెర్ (బ్రెజిల్); గుకేశ్ (భారత్)–దుబోవ్ (రష్యా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు శనివారం ‘టైబ్రేక్’ నిర్వహిస్తారు. అరవింద్ చిదంబరం (భారత్) 0.5–1.5తో నోదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... ఇనియన్ (భారత్) 0–2తో తొమాస్‌షెవ్‌స్కీ (రష్యా) చేతిలో ఓడిపోయారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో రౌండ్లోకి ప్రవేశించింది. హారిక ప్రత్యర్థి మెదీనా (ఇండోనేసియా)కు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె బరిలోకి దిగలేదు. భక్తి కులకర్ణి 0.5–1.5తో నటాలియా పొగోనినా (రష్యా) చేతిలో... వైశాలి 0–2తో బేలా ఖొటెనాష్విలి (జార్జియా) చేతిలో ఓడిపోయారు. పద్మిని రౌత్ (భారత్)–సారాసదత్ (ఇరాన్) 1–1తో సమంగా నిలువడంతో శనివారం టైబ్రేక్‌లో తలపడతారు. -
ప్రిక్వార్టర్స్‌లో సానియా–బోపన్న జంట
లండన్: నాలుగేళ్ల విరామం తర్వాత వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో బరిలోకి దిగిన సానియా మీర్జా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. భారత్‌కే చెందిన రోహన్ బోపన్నతో జతకట్టిన సానియా మీర్జా భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 6–3, 6–1తో ఐడన్ మెక్‌హగ్–ఎమిలీ వెబ్లీస్మిత్ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. 47 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీ స్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా)లతో సానియా–బోపన్న ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో భార్యాభర్తలైన దివిజ్ శరణ్ (భారత్)–సమంత ముర్రే శరణ్ (బ్రిటన్) జోడీ 6–3, 6–7 (1/7), 3–6తో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–దరియా జురాక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడింది. మెద్వెదేవ్ తొలిసారి... పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) అద్భుత పోరాటపటిమ కనబరిచి గట్టెక్కాడు. మూడో రౌండ్లో మెద్వెదేవ్ 6–7 (3/7), 3–6, 6–3, 6–3, 6–2తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గి ఈ టోర్నీలో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్‌లో మెద్వెదేవ్ 3 గంటల 36 నిమిషాల్లో గెలుపొందాడు. తొలి రెండు సెట్లు చేజార్చుకున్నాక మెద్వెదేవ్ కోలుకున్నాడు. వరుసగా మూడు సెట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 16 ఏస్‌లు సంధించిన మెద్వెదేవ్ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. బార్టీ ముందంజ... మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్లో బార్టీ 6–3, 7–5తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. గంటా 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బార్టీ ఎనిమిది ఏస్‌లు సంధించింది. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు మొదలవుతాయి. మంగళవారం నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల నుంచి వంద శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వనున్నట్లు... ఈ మేరకు ఇంగ్లండ్ ప్రభుత్వం నుంచి తమకు అనుమతి లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఇంతకుముందు కేవలం పురుషుల, మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లకే వంద శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. -
జొకోవిచ్ జోరు
లండన్: కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ సెర్బియా స్టార్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2018 రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–3తో గెలుపొందాడు. గంటా 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఎదుర్కోలేదు. తొమ్మిది ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు పదిసార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచాడు. అండర్సన్ 26 అనవసర తప్పిదాలు చేయగా... జొకోవిచ్ ఆరు మాత్రమే చేశాడు. మరోవైపు 11వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్), 12వ సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. సామ్ క్వెరీ (అమెరికా) 7–6 (8/6), 6–4, 7–5తో కరెనో బుస్టాను... జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) 7–6 (8/6), 7–6 (7/3), 2–6, 2–6, 6–2తో రూడ్‌ను ఓడించారు. సబలెంకా ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లోకి ప్రవేశించగా... నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) రెండో రౌండ్లో... ఐదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా), తొమ్మిదో సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లో ఇంటిముఖం పట్టారు. రెండో రౌండ్లో సబలెంకా 4–6, 6–3, 6–3తో కేటీ బౌల్టర్ (బ్రిటన్)పై గెలిచింది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అలీజె కార్నె (ఫ్రాన్స్) 6–2, 6–1తో ఆండ్రెస్కూపై, కాయా యువాన్ (స్లొవేనియా) 6–3, 6–3తో బెన్చిచ్పై సంచలన విజయం సాధించారు. రెండో రౌండ్ మ్యాచ్‌లో మాడిసన్ బ్రెంగల్ (అమెరికా) 6–2, 6–4తో సోఫియా కెనిన్‌ను బోల్తా కొట్టించింది. -
French Open 2021: సెరెనా సాఫీగా...
పారిస్: రెండో రౌండ్లో శ్రమించి విజయాన్ని దక్కించుకున్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మూడో రౌండ్లో మాత్రం తడబడకుండా ఆడింది. తన దేశానికే చెందిన డానియెలా కొలిన్స్‌తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 6–4, 6–4తో గెలిచిన ఏడో సీడ్ సెరెనా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో 13వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా ఐదు ఏస్‌లు సంధించింది. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి 8సార్లు పాయింట్లు సంపాదించిన సెరెనా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. పావ్లీచెంకోవా సంచలనం మరోవైపు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన మూడో సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. 31వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా) అద్భుత ఆటతీరుతో 6–4, 2–6, 6–0తో సబలెంకాను బోల్తా కొట్టించి 2011 తర్వాత ఈ టోర్నీ లో మళ్లీ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 15వ సీడ్ అజరెంకా (బెలారస్) 6–2, 6–2తో 23వ సీడ్ కీస్ (అమెరికా)పై, 20వ సీడ్ మర్కెత వొంద్రుసొవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3తో పొలోనా హెర్కాగ్ (స్లొవేనియా)పై, 21వ సీడ్ రిబికినా (కజకిస్తాన్) 6–1, 6–4తో వెస్నినా (రష్యా)పై, తామర జిదాన్సెక్ (స్లొవేనియా) 0–6, 7–6 (7/5), 6–2తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. 1968 తర్వాత తొలిసారి... పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో నాదల్ 6–0, 7–5, 6–2తో గెలుపొందాడు. గాస్కే పరాజయంతో 1968 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగంలో ఒక్క ఫ్రాన్స్ క్రీడాకారుడు కూడా మూడో రౌండ్‌కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. ఈసారి సింగిల్స్ విభాగంలో ఫ్రాన్స్ నుంచి 29 మంది బరిలోకి దిగారు. మరోవైపు మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 7–5, 6–2తో లాస్లో జెరె (సెర్బియా)పై, రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 6–4, 6–2, 6–4తో ఒపెల్కా (అమెరికా)పై, 12వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) 6–4, 6–4, 6–2తో జాన్సన్ (అమెరికా)పై ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. 15వ సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 4 గంటల 35 నిమిషాల్లో 6–7 (3/7), 6–2, 6–7 (6/8), 6–0, 5–7తో ఫోకినా (స్పెయిన్) చేతిలో... 27వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) 4–6, 1–6, 3–6తో డెల్బోనిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. -
French Open 2021: ఫెడరర్ ముందంజ
పారిస్: స్విస్ దిగ్గజం, 20 గ్రాండ్‌స్లామ్‌ల విజేత రోజర్ ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో ఎనిమిదో సీడ్ ఫెడరర్ 6–2, 2–6, 7–6 (7/4), 6–2తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలుపొంది మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. 2 గంటలా 35 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ను ఫెడరర్ ఘనంగా ఆరంభించాడు. పదునైన ఏస్‌లతో పాటు... బ్యాక్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి తొలి సెట్‌ను అలవోకగా నెగ్గాడు. అయితే రెండో సెట్లో పుంజుకున్న సిలిచ్ ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక మూడో సెట్ ‘టై బ్రేక్’కు దారితీయగా... అక్కడ ఎటువంటి ఒత్తిడికి గురికాని ఫెడరర్ ‘టై బ్రేక్’ ద్వారా మూడో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడిన ఫెడరర్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 16 ఏస్‌లు సంధించి... ఒకే ఒక్క డబుల్ ఫాల్ట్ చేశాడు. సిలిచ్ 12 ఏస్‌లు కొట్టినా కీలక సమయాల్లో ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. జొకోవిచ్, స్వియాటెక్ కూడా... రెండో రౌండ్ పోరులో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా ఆటగాడు జొకోవిచ్ 6–3, 6–2, 6–4తో పబ్‌లో క్వెవాజ్ (ఉరుగ్వే)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. రెండు గంటలా ఆరు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఎక్కడా తడబాటుకు గురికాకుండా మ్యాచ్‌ను ముగించేశాడు. రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) 3–6, 6–1, 6–4, 6–3తో టామీ పాల్ (అమెరికా)పై నెగ్గి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ అలవోకగా మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. ఎనిమిదో సీడ్ స్వియాటెక్ 6–1, 6–1తో 61 నిమిషాల్లో రెబెకా పీటర్సన్ (స్వీడన్)ను అలవోకగా ఓడించింది. బార్టీని వెంటాడిన గాయం... ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మహిళల సింగిల్స్ టాప్ సీడ్, ఆస్ట్రేలియా భామ యాష్లే బార్టీ తుంటి గాయంతో తప్పుకుంది. మగ్దా లినెట్టే (పొలాండ్)తో జరిగిన రెండో రౌండ్ పోరు మధ్యలోనే 2019 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బార్టీ గాయంతో వైదొలిగింది. మ్యాచ్‌లో బార్టీ 1–6, 2–2తో వెనుకబడి ఉన్న సమయంలో ఇక ఆడటం తన వల్ల కాదంటూ ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చింది. మ్యాచ్ ఆడుతున్నంత సేపూ ఇబ్బంది పడ్డ బార్టీ తొలి సెట్‌ను 1–6తో కోల్పోయింది. అనంతరం ఆమె మెడికల్ టైమౌట్ను కూడా తీసుకుంది. ఆ తర్వాత కూడా కోర్టులో సౌకర్యంగా కదల్లేకపోయిన బార్టీ మ్యాచ్ నుంచి తప్పుకుంది. మరోవైపు తొమ్మిదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 5–7, 1–6తో అన్‌సీడెడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) చేతిలో ఓడింది. ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–0, 6–4తో అన్ లీ (అమెరికా)పై, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 7–5, 6–3తో హెలీ (అమెరికా)పై, అమెరికా టీనేజ్ సంచలనం కోకో గౌఫ్ 6–3, 7–6 (7/1)తో వాంగ్ క్వియాంగ్ (చైనా)పై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ... పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)– ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండో రౌండ్లో బోపన్న–స్కుగోర్ జంట 6–4, 7–5తో ఫ్రాన్సెస్ టియాఫో– నికోలస్ మొన్రో (అమెరికా) జంటపై గెలిచింది. మరో వైపు పురుషుల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగాల్సిన ఒక జంటకు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వారి పేర్లను మాత్రం నిర్వాహకులు బయటపెట్టలేదు. పాజిటివ్‌గా తేలిన జోడీ టోర్నీ నుంచి వైదొలిగిందని... వారి స్థానంలో వేరే జంటను బరిలోకి దింపినట్లు వెల్లడించారు. నేను ఆలస్యం చేస్తున్నానా..! ఈ మ్యాచ్‌లో ఫెడరర్ సహనాన్ని కోల్పోయాడు. రెండో సెట్ ఐదో గేమ్‌లో సిలిచ్ సర్వీస్ చేస్తుండగా... సర్వీస్‌ను రిసీవ్ చేసుకునే స్థానానికి ఫెడరర్ ఆలస్యంగా చేరుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్నాడంటూ చైర్ అంపైర్ అతనికి ‘సమయ ఉల్లంఘన’ హెచ్చరికను జారీ చేశాడు. దీనిపై ఆగ్రహించిన ఫెడరర్ అంపైర్‌తో కొన్ని నిమిషాలపాటు వాగ్వివాదానికి దిగాడు. సిలిచ్‌ను చూస్తూ ‘నేను మరీ అంత నెమ్మదిగా ఉన్నానా...’ అంటూ ఫెడరర్ ప్రశ్నించగా... ‘అవునూ... నేను సర్వీస్‌కు సిద్ధంగా ఉన్నా... నువ్వు మాత్రం టవల్‌తో కాలక్షేపం చేస్తూ కనిపిస్తున్నావ్’ అంటూ సిలిచ్ బదులిచ్చాడు. -
French Open 2021:సెరెనా శ్రమించి...
పారిస్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆ దిశగా మరో అడుగు వేసింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ సెరెనా మూడో రౌండ్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో సెరెనా 2 గంటల 3 నిమిషాల్లో 6–4, 5–7, 6–1తో ప్రపంచ 174వ ర్యాంకర్ మిహేలా బుజర్‌నెస్కూ (రొమేనియా)పై కష్టపడి గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఐదు ఏస్‌లు సంధించిన సెరెనా, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. మరోవైపు పదో సీడ్ బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బెన్‌చిచ్ 2–6, 2–6తో కసత్కినా (రష్యా) చేతిలో ఓడిపోయింది. జొకోవిచ్ శుభారంభం పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ తొలి రౌండ్లో 6–2, 6–4, 6–2తో సాండ్‌గ్రెన్ (అమెరికా)పై నెగ్గి శుభారంభం చేశాడు. ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్లో సిట్సిపాస్ 6–3, 6–4, 6–3తో మార్టినెజ్ (స్పెయిన్)పై, జ్వెరెవ్ 7–6 (7/4), 6–3, 7–6 (7/1)తో గెలిచారు. 11వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) 3–6, 6–2, 3–6, 2–6తో లాక్సోనెన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–డెల్బోనిస్ (అర్జెంటీనా) 6–3, 6–7 (11/13), 4–6తో డిమినార్–రూడ్ (ఆస్ట్రేలియా) చేతిలో... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అంకిత రైనా (భారత్)–లౌరెన్ (అమెరికా) 4–6, 4–6తో హర్డెక (చెక్ రిపబ్లిక్)–సిగెముండ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కెనిన్‌కు షాక్
మెల్బోర్న్: ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మహిళల డిఫెండింగ్ చాంపియన్ కెనిన్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ఇంటి దారి పట్టింది. ఈస్టోనియాకు చెందిన 35 ఏళ్ల వెటరన్ ప్లేయర్ కియా కానెపి 2020 చాంపియన్‌పై సంచలన విజయం సాధించింది. మిగతా మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) ముందంజ వేశారు. భారత క్రీడాకారులకు డబుల్స్‌లో చుక్కెదురైంది. మహిళల్లో మరో సంచలనం మహిళల సింగిల్స్‌లో నాలుగో రోజు కూడా సంచలన ఫలితం వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నిరుటి విజేత కెనిన్ ఆట రెండో రౌండ్లోనే ముగిసింది. అన్‌సీడెడ్ ప్లేయర్ కియా కానెపి వరుస సెట్లలో 6–3, 6–2తో నాలుగో సీడ్ కెనిన్‌పై అలవోక విజయం సాధించింది. 2007 నుంచి క్రమం తప్పకుండా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్నా... క్వార్టర్స్ చేరని 35 ఏళ్ల కానెపి ఈ సీజన్లో మాత్రం అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కేవలం గంటా 4 నిమిషాల్లోనే 22 ఏళ్ల అమెరికా యువ క్రీడాకారిణిని కంగుతినిపించింది. మిగతా మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 7–6 (9/7)తో తమ దేశానికే చెందిన వైల్డ్‌కార్డ్ ప్లేయర్ డారియా గావ్రిలొవాపై శ్రమించి నెగ్గింది. తొలిసెట్‌ను ఏకపక్షంగా ముగించిన ప్రపంచ నంబర్‌వన్‌కు రెండో సెట్లో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. అనామక ప్లేయర్ డారియా అద్భుతంగా పుంజుకోవడంతో ప్రతి పాయింట్ కోసం బార్టీకి చెమటోడ్చక తప్పలేదు. హోరాహోరీగా జరిగిన రెండో సెట్ చివరకు టైబ్రేక్‌కు దారితీసింది. అక్కడ కూడా స్వదేశీ ప్రత్యర్థి ఏమాత్రం తగ్గకపోవడంతో టాప్‌సీడ్ సర్వశక్తులు ఒడ్డి గెలిచింది. ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–2తో డానియెల్లా కొలిన్స్ (అమెరికా)పై, ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–3తో కొకొ గాఫ్ (అమెరికా)పై అలవోక విజయం సాధించారు. 11వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) 7–5, 2–6, 6–4తో స్వెత్లానా కుజ్నెత్సొవా (రష్యా)పై చెమటోడ్చి గెలిచింది. నాదల్ జోరు కెరీర్లో 21వ టైటిల్‌పై కన్నేసిన నాదల్ తన జోరు కొనసాగించాడు. పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో స్పానిష్ దిగ్గజం, రెండో సీడ్ నాదల్ 6–1, 6–4, 6–2తో క్వాలిఫయర్ మైకేల్ మోహ్ (అమెరికా)పై సునాయాస విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ఓ వైల్డ్‌కార్డ్ ప్లేయర్‌పై రెండో రౌండ్ గెలిచేందుకు ఐదో సీడ్ సిట్సిపాస్ నాలుగున్నర గంటల పాటు పోరాడాడు. చివరకు గ్రీస్ ప్లేయర్ 6–7 (5/7), 6–4, 6–1, 6–7 (5/7), 6–4తో కొక్కినకిస్ (ఆస్ట్రేలియా)పై గెలిచి ఊపిరిపీల్చుకున్నాడు. నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–2, 7–5, 6–1తో కార్బలెస్ బయెనా (స్పెయిన్)పై, ఏడో సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–4, 7–6 (10/8)తో మాంటెరియా (బ్రెజిల్)పై విజయం సాధించగా, తొమ్మిదో సీడ్ మట్టె బెరెటినీ (ఇటలీ) 6–3, 6–2, 4–6, 6–3తో క్వాలిఫయర్ టామస్ మచాక్ (చెక్ రిపబ్లిక్)పై కష్టంమీద గెలిచాడు. 16వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) 4–6, 6–2, 2–6, 6–3, 7–6 (14/12) తన దేశానికే చెందిన కరుసోపై సుదీర్ఘ పోరాటం చేసి నెగ్గాడు. సుమారు నాలుగు గంటల పాటు హోరాహోరీగా ఈ మ్యాచ్ జరిగింది. 28వ సీడ్ క్రాజినొవిక్ (సెర్బియా) 6–2, 5–7, 6–1, 6–4తో పాబ్లో అండ్యుజర్ (స్పెయిన్)పై గెలుపొందాడు. దివిజ్, అంకిత జోడీలు ఔట్ భారత జోడీలకు సీజన్ ఆరంభ ఓపెన్‌లో నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో దివిజ్, మహిళల డబుల్స్‌లో అంకితా రైనా తొలిరౌండ్లోనే నిష్క్రమించారు. స్లోవేకియాకు చెందిన ఇగొర్ జెలెనేతో జతకట్టిన దివిజ్ శరణ్ 1–6, 4–6తో యనిక్ హన్ఫన్– కెవిన్ క్రావిజ్ జోడీ చేతిలో ఓడిపోయారు. ఇదివరకే సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న ద్వయం కూడా కంగుతినడంతో డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల ఈవెంట్లో అంకిత–మిహెల బుజర్నెకు (రుమేనియా) జంట 3–6, 0–6తో ఒలివియా గడెకి–బెలిండా వూల్‌కాక్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడింది. -
ఒస్టాపెంకో ముందంజ
మూడేళ్ల క్రితం అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి సంచలన ప్రదర్శనతో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన జెలెనా ఒస్టాపెంకో తనకు అచ్చొచ్చిన వేదికగా మళ్లీ రాణిస్తోంది. 2020లో కూడా అన్‌సీడెడ్‌గా వచ్చిన ఈ లాత్వియా అమ్మాయి టోర్నీ రెండో సీడ్ ప్లిస్కోవాకు షాక్ ఇచ్చి మరో అడుగు ముందుకు వేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సోఫియా కెనిన్ కొంత పోరాడి మూడో రౌండ్‌కు చేరగా, పురుషుల విభాగంలో నంబర్‌వన్ జొకోవిచ్ కూడా తన జోరు ప్రదర్శించగా, గురువారం టోర్నీలో ఇతర సంచలనాలేమీ నమోదు కాలేదు. పారిస్: మాజీ చాంపియన్, అన్‌సీడెడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మూడో రౌండ్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఒస్టాపెంకో 6–4, 6–2 స్కోరుతో 2వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసిన ఆమె 27 విన్నర్లు కొట్టింది. ఇటీవల జరిగిన రోమ్ ఓపెన్‌కు ఫైనల్‌కు చేరి గాయంతో తప్పుకున్న ప్రపంచ 8వ ర్యాంకర్ ప్లిస్కోవా 69 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. నాలుగో సీడ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ కూడా ముందంజ వేసింది. రెండో రౌండ్లో ఆమె 3–6, 6–3, 6–2 తేడాతో అనా బోగ్డెన్ (రొమేనియా)ను ఓడించింది. ఇతర మహిళల సింగిల్స్ మ్యాచ్‌లలో ఏడో సీడ్ పెట్రో క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3తో జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ అరైనా సబలెంకా (బెలారస్)పై, పావ్లా బడోసా (స్పెయిన్) 6–4, 4–6, 6–2తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై విజయం సాధించారు. ఓటమి తప్పించుకున్న జ్వెరేవ్... పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ (జర్మనీ)కి అదృష్టం కలిసొచ్చింది. పియరీ హ్యూజెస్ హెర్బర్ట్ (ఫ్రాన్స్)తో ఐదు సెట్ల పాటు జరిగిన పోరులో అతను చివరకు విజయం సాధించి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 59 నిమిషాల పాటు సాగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో జ్వెరేవ్ 2–6, 6–4, 7–6 (7/5), 4–6, 6–4తో గెలుపొందాడు. 45 విన్నర్లు కొట్టిన జ్వెరేవ్ 10 ఏస్‌లు సంధించాడు. 3 గంటల 53 నిమిషాలు సాగిన మరో మ్యాచ్‌లో స్టెఫానో ట్రవాగ్లియా (ఇటలీ) 6–4, 2–6, 7–6 (9/7), 4–6, 6–2తో నిషికొరి (జపాన్)పై విజయం సాధించాడు. టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు రెండో రౌండ్లో ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. కేవలం 83 నిమిషాల్లో ముగిసి మ్యాచ్‌లో జొకోవిచ్ 6–1, 6–2, 6–2తో బెరాంకిస్ (లిథువేనియా)ను చిత్తుగా ఓడించి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్) 6–1, 6–4, 6–2తో పాబ్లో క్వాస్ (ఉరుగ్వే)ను ఓడించి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. దివిజ్ జోడి ఓటమి... పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు దివిజ్ శరణ్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. శరణ్–సూన్‌వూ క్వాన్ (కొరియా) జంట 2–6, 6–4, 4–6తో ఫ్రాంకో స్కుగర్ (క్రొయేషియా)–అస్టిన్ క్రాజిసెక్ (అమెరికా) చేతిలో పరాజయంపాలైంది. -
‘అమ్మ’ గెలిచింది
మూడు పదుల వయసు దాటినా... తల్లి హోదా వచ్చినా... మైదానంలోకి దిగితే విజయమే తమ లక్ష్యమని ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు సెరెనా విలియమ్స్, విక్టోరియా అజరెంకా చాటి చెప్పారు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఈ ఇద్దరు అమ్మలు అదరగొట్టే విజయాలతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లి టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. న్యూయార్క్: ఒకవైపు యువ సీడెడ్ క్రీడాకారిణులు ఇంటిముఖం పడుతుండగా... మరోవైపు తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో వెటరన్ స్టార్ క్రీడాకారిణులు సెరెనా విలియమ్స్ (అమెరికా), విక్టోరియా అజరెంకా (బెలారస్) యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ముందంజ వేశారు. తల్లి అయ్యాక గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన నాలుగో క్రీడాకారిణిగా గుర్తింపు పొందేందుకు వీరిద్దరు పోటీపడుతున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సెరెనా 6–2, 6–4తో ప్రపంచ 117వ ర్యాంకర్ మర్గరీటా గస్పారన్ (రష్యా)పై, అజరెంకా 6–1, 6–3తో ఐదో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)పై విజయం సాధించారు. మరో ‘అమ్మ’ స్వెతానా పిరన్కోవా (బల్గేరియా) 7–5, 6–3తో పదో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)ను ఓడించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. ఓవరాల్‌గా ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో తొమ్మిది మంది తల్లి హోదా ఉన్న క్రీడాకారిణులు బరిలోకి దిగారు. ఇందులో ఆరుగురు కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం), వెరా జ్వొనరేవా (రష్యా), తతియానా మరియా (జర్మనీ), కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్), పత్రిసియా మరియా తిగ్ (రొమేనియా), ఓల్గా గొవొర్సోవా (బెలారస్) నిష్క్రమించగా... సెరెనా, అజరెంకా, పిరన్కోవా బరిలో మిగిలి ఉన్నారు. గస్పారన్తో 93 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సెరెనా ఏడు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. క్రిస్టియా సంచలనం మహిళల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం ఫలితం వచ్చింది. ప్రపంచ 77వ ర్యాంకర్ సొరానా క్రిస్టియా 2–6, 7–6 (7/5), 6–4తో తొమ్మిదో సీడ్ యోహానా కొంటా (బ్రిటన్)ను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో మూడోసారి మూడో రౌండ్‌కు చేరింది. ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–4, 6–3తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై, ఏడో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–2, 6–1తో అలియానా బోల్సోవా (స్పెయిన్)పై, 15వ సీడ్ మరియా సాకరి (గ్రీస్) 2–6, 6–3, 6–2తో బెర్నార్దా పెరా (అమెరికా)పై, 26వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–2, 6–2తో గొవొర్సోవా (బెలారస్)పై నెగ్గారు. ముర్రే ఇంటిదారి పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 2012 చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) 2–6, 3–6, 4–6తో ఫీలిక్స్ ఉజర్ అలియాసిమ్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. మూడో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 6–3, 6–2, 6–4తో క్రిస్టోఫర్ కానెల్ (ఆస్ట్రేలియా)పై, ఆరో సీడ్ బెరెటిని (ఇటలీ) 6–4, 6–4, 7–6 (8/6)తో హుంబెర్ట్ (ఫ్రాన్స్)పై గెలుపొందారు. సుమీత్ నిష్క్రమణ పురుషుల సింగిల్స్ బరి లో ఉన్న ఏకైక భారత క్రీడాకారుడు సుమీత్ నాగల్ కథ రెండో రౌండ్ లో ముగిసింది. సుమీత్ 3–6, 3–6, 2–6తో రెండో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. గంటా 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమీత్ 40 అనవసర తప్పిదాలు చేశాడు. -
గెలిస్తేనే నిలుస్తారు
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతిలకు ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు హరికృష్ణ 52 ఎత్తుల్లో కిరిల్ అలెక్‌సీన్‌కో (రష్యా) చేతిలో... మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ 93 ఎత్తుల్లో సో వెస్లీ (అమెరికా) చేతిలో ఓటమి చవిచూశారు. ప్రిక్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే... నేడు జరిగే రెండో గేమ్‌లో హరికృష్ణ, విదిత్ తప్పనిసరిగా గెలవాల్సిందే. వీరిద్దరు కనీసం ‘డ్రా’ చేసుకున్నా ఈ టోర్నీలో భారత కథ ముగుస్తుంది. -
మూడో రౌండ్లో అనిల్, రవీందర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి సీనియర్ గ్రీన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో అనిల్ కుమార్ (ఏజీఏ), రవీందర్ గౌడ్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీలో ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో వి. అనిల్ కుమార్ (ఏజీఏ) 25–0, 25–0తో ఆర్. శ్రీనుపై, రవీందర్ గౌడ్ 25–8, 25–4తో శశిపై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో లలిత్ స్వామి 18–22, 21–8, 21–19తో ఎంవీఎస్ఎన్వీ ప్రసాద్ (ఐటీఆర్సీ)పై, ఏఎన్ మూర్తి 25–15, 24–22తో పి. రవిపై, ఆయూబ్ 24–5, 23–7తో దీపక్‌పై, రవి 25–0, 25–7తో గౌతమ్‌పై, జుబేర్ ఖాన్ 20–1, 16–7తో అజహర్‌పై, ఎస్. శ్రీకాంత్ 17–21, 25–0, 17–6తో వై. సుబ్రహ్మణ్యంపై, అబ్దుల్లా 25–12, 17–23, 21–5తో వెంకటేశ్‌పై, జయప్రసాద్ 25–4, 12–25, 23–7తో సలావుద్దీన్‌పై, మహేశ్ 25–1, 25–3తో బిస్వజీత్పై, సయ్యద్ జుబేద్ అహ్మద్ 25–5, 25–11తో సాయి కృష్ణపై, బిసిల్ ఫిలిఫ్స్ 25–8, 25–3తో ద్వారకపై, ఎస్. అశ్విని కుమార్ 25–6, 25–5తో శంషుద్దీన్పై, వేణుగోపాల్ 23–5, 25–0తో కె. దేవేందర్‌పై గెలుపొందారు. ఇతర రెండోరౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు మునీర్ అహ్మద్ 25–0, 25–4తో కేవీ శ్రీకాంత్‌పై, ఎల్. సూర్యప్రకాశ్ 25–7, 18–25, 25–0తో విశాల్‌పై, ఎస్. నవీన్ 25–1, 25–1తో ప్రవీణ్‌పై, ఎల్. శ్యామ్ 25–12, 25–14తో నర్సయ్యపై, పి. మహేశ్ కుమార్ 24–0, 25–0తో దామోదర్‌పై, అబ్దుల్ 25–10, 25–0తో ఖాదిర్‌పై, పాండ్యన్ 25–5, 9–25, 25–9తో చంద్రశేఖర్‌పై, మొహమ్మద్ ఉస్మాన్ 24–12, 14–7తో గణేశన్పై, వి. శివానంద రెడ్డి 25–12, 25–0తో సయీద్‌పై, పి. శశికుమార్ 13–11, 0–25, 25–14తో ఎం. శ్రీనివాస్‌పై, ఎస్కే జాఫర్ 25–0, 25–0తో వి. చంద్రపాల్‌పై, ఎస్. రమేశ్ 25–21, 25–5తో జగన్ మోహన్‌పై, ఉపేందర్ 25–0, 25–5తో హనీజెస్టన్పై, నసరుల్లా ఖాన్ 23–17, 20–23, 25–12తో మొహమ్మద్‌పై, జై కుమార్ 25–14, 25–9తో రఫీఖ్పై, వసీమ్ 25–0, 25–0తో రెహమాన్‌పై, ఫసి 25–0, 25–11తో జీవన్‌పై, నందుకుమార్ 25–0, 22–0తో సయ్యద్ మోయిజ్పై, వీఎస్కే నాయుడు 10–20, 22–2, 24–4తో విక్రమ్‌కుమార్‌పై గెలిచారు. -
మూడో రౌండ్లో శ్రీ కృష్ణప్రియ
పట్నా: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి శ్రీ కృష్ణప్రియ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ శ్రీ కృష్ణప్రియ 21–12, 21–14తో రియా ముఖర్జీ (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఆదివారం జరిగే మూడో రౌండ్లో చత్తీస్‌గఢ్‌కు చెందిన ఆకర్షి కశ్యప్‌తో ఆడుతుంది. తెలంగాణకే చెందిన రెండో సీడ్ రితూపర్ణ దాస్, ప్రమద, వైష్ణవి కూడా మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్లో రితూపర్ణ 21–11, 16–21, 21–10తో కనికా కన్వల్ (ఎయిరిండియా)పై, ప్రమద 21–17, 23–21తో పూర్ణిమ దేవి (మణిపూర్)పై, వైష్ణవి 24–22, 21–12తో స్నేహ రజ్వార్ (ఉత్తరాఖండ్)పై గెలిచారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు సాయి ఉత్తేజిత రావు, తనిష్క్ కూడా మూడో రౌండ్లోకి చేరుకున్నారు. రెండో రౌండ్లో నాలుగో సీడ్ సాయి ఉత్తేజిత 21–7, 21–11తో విభా జితేంద్ర ప్రసాద్ (బిహార్)పై, తనిష్క్ 21–17, 21–15తో దీప్తి రమేశ్ (కర్ణాటక)పై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారులు సిరిల్ వర్మ, రాహుల్ యాదవ్ ముందంజ వేశారు. రెండో రౌండ్లో రాహుల్ 21–13, 21–13తో రూపిందర్ సింగ్ (చండీగఢ్)పై, సిరిల్ 21–11, 21–9తో పురుషోత్తం (గుజరాత్)పై గెలిచారు. -
రద్వాన్‌స్కా శ్రమించి...
* మూడో రౌండ్లోకి నాలుగో సీడ్ * సెరెనా, వీనస్ అలవోకగా... * యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ న్యూయార్క్: గతంలో పదిసార్లు యూఎస్ ఓపెన్‌లో పాల్గొన్నా ఒక్కసారీ నాలుగో రౌండ్ దాటలేకపోరుున నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) ఈసారి ఆ అడ్డంకిని దాటి మరో అడుగు ముందుకేసింది. నవోమి బ్రాడీ (బ్రిటన్)తో జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో రద్వాన్‌స్కా 7-6 (11/9), 6-3తో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. గంటా 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రాడీ నుంచి రద్వాన్‌స్కాకు గట్టిపోటీనే ఎదురైంది. బ్రాడీ శక్తివంతమైన సర్వీస్‌లు, అంచనా వేయలేని షాట్లతో రద్వాన్‌స్కా తొలి సెట్లో ఒకదశలో 2-5తో వెనుకబడింది. అయితే బ్రాడీ ఆటతీరుపై అవగాహన కలిగాక ఈ ప్రపంచ మాజీ రెండో ర్యాంకర్ తేరుకుంది. స్కోరును సమం చేయడంతోపాటు సెట్‌ను టైబ్రేక్ వరకు తీసుకెళ్లింది. టైబ్రేక్‌లో రద్వాన్‌స్కా 5-2తో ముందంజ వేసినా వెంటనే తడబడింది. రెండుసార్లు సెట్ పాయింట్లను కాపాడుకొని తుదకు టైబ్రేక్‌లో 11-9తో గెలిచి తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ తొలి గేమ్‌లోనే రద్వాన్‌స్కా తన సర్వీస్‌ను కోల్పోయి 0-2తో వెనుకబడింది. కానీ వెంటనే కోలుకొని బ్రాడీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రద్వాన్‌స్కా స్కోరును 2-2తో సమం చేసింది. ఆ తర్వాత మరోసారి బ్రాడీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను, మ్యాచ్‌ను కై వసం చేసుకుంది. ‘బ్రాడీ కంటే ఒకట్రెండు పాయింట్లు మెరుగ్గా ఆడాను. నేను 100 శాతం శ్రమించేలా ఆమె ఆడించింది. ఆరంభంలో కాస్త నెమ్మదిగా కదిలాను. దానికి మూల్యంగా రెండుసార్లు సెట్ పాయింట్ కోల్పోయే పరిస్థితి ఎదుర్కొన్నాను. ముఖ్యంగా బ్రాడీ సర్వీస్ చాలా బాగా చేసింది. దాంతో ప్రతి పాయింట్ కీలకంగా మారింది’ అని రద్వాన్‌స్కా వ్యాఖ్యానించింది. అక్కాచెల్లెళ్లు ముందుకు... మరోవైపు విలియమ్స్ సిస్టర్స్ సెరెనా, వీనస్ సునాయాస విజయాలతో మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్లో టాప్ సీడ్ సెరెనా 6-3, 6-3తో వానియా కింగ్ (అమెరికా)పై, ఆరో సీడ్ వీనస్ 6-2, 6-3తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 7-5తో మాంట్సెరెట్ గొంజాలెజ్ (పరాగ్వే)పై, 17వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా) 6-2, 4-6, 7-6 (7/5)తో మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స)పై, 11వ సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 6-1, 6-4తో జెలెనా జంకోవిచ్ (సెర్బియా)పై గెలిచారు. 16వ సీడ్, మాజీ చాంపియన్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 3-6, 3-6తో షుఝె జాంగ్ (చైనా) చేతిలో, 15వ సీడ్ తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 4-6, 6-4, 4-6తో వర్వారా లెప్చెంకో (అమెరికా) చేతిలో ఓడిపోయారు. ముర్రే, వావ్రింకా జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ కీ నిషికోరి (జపాన్) మూడో రౌండ్లోకి చేరుకున్నారు. రెండో రౌండ్లో ముర్రే 6-4, 6-1, 6-4తో గ్రానోలెర్స్ (స్పెరుున్)పై, వావ్రింకా 6-1, 7-6 (7/4), 7-5తో గియానెసి (ఇటలీ)పై, నిషికోరి 6-4, 4-6, 6-4, 6-3తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్టియ్రా) 6-4, 6-3, 6-2తో బెరాన్కిస్ (లిథువేనియా)పై, 11వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెరుున్) 6-0, 4-6, 5-7, 6-1, 6-4తో ఫాగ్నిని (ఇటలీ)పై, 14వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7-5, 6-4, 6-4తో జెబలోస్ (అర్జెంటీనా)పై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. 16వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెరుున్) 2-6, 4-6, 6-1, 7-5తో జోవో సుసా (పోర్చుగల్) చేతిలో, 30వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స) 6-3, 2-6, 2-6, 7-6 (7/1), 6-7 (3/7)తో లొరెంజీ (ఇటలీ) చేతిలో, 27వ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 4-6, 4-6, 7-5, 2-6తో డానియల్ ఇవాన్స్ (బ్రిటన్) చేతిలో ఓటమి చవిచూశారు. ప్రిక్వార్టర్స్‌లో వొజ్నియాకి, విన్సీ గతేడాది రన్నరప్ రొబెర్టా విన్సీ (ఇటలీ), మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో విన్సీ 6-0, 5-7, 6-3తో వితెఫ్ట్ (జర్మనీ)పై, వొజ్నియాకి 6-3, 6-1తో మోనికా నికులెస్కూ (రొమేనియా)పై గెలిచారు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో సెవస్తోవా (లాత్వియా) 6-4, 6-1తో కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్)ను ఓడించింది. ప్రాంజల శుభారంభం బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్లో 16వ సీడ్ ప్రాంజల 6-3, 6-2తో విక్టోరియా ఎమ్మా (అమెరికా)ను ఓడించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)-బెగెమన్ (జర్మనీ) ద్వయం 2-6, 7-5, 4-6తో స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స)-డూడీ సెలా (ఇజ్రాయెల్) జంట చేతిలో ఓడిపోయింది. -
మంగళ్ ‘రియో’ ఆశలు సజీవం
ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ కొపెన్‌హగెన్ (డెన్మార్క్): వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత ఆర్చర్ మంగళ్ సింగ్ చంపియా ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం తొలి రౌండ్లో చంపియా 7-3తో రెజెండి జేవియర్ డానియల్ (బ్రెజిల్)పై, రెండో రౌండ్లో 7-3తో ముసయెవ్ సంజార్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. అల్వారినో గార్సియా (స్పెయిన్)తో జరిగే మూడో రౌండ్లో చంపియా విజయం సాధిస్తే వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. మరోవైపు భారత్‌కే చెందిన జయంత తాలుక్దార్, రాహుల్ బెనర్జీ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. జయంత 2-6తో జే లియోన్ (కెనడా) చేతిలో; రాహుల్ బెనర్జీ 0-6తో బోర్డ్‌మన్ (మెక్సికో) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో లక్ష్మీరాణి మాఝీ కూడా మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో థామస్ స్లోనీ (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్లో వలీవా నటాలియా (ఇటలీ)పై లక్ష్మీరాణి ‘టైబ్రేక్’లో విజయం సాధించడం విశేషం. భారత్‌కే చెందిన దీపిక కుమారికి నేరుగా మూడో రౌండ్లోకి ‘బై’ లభించింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు నేరుగా మూడో రౌండ్లోకి ‘బై’ లభించింది. -
చాంపియన్‌కు షాక్
జంకోవిచ్ చేతిలో క్విటోవా ఓటమి ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్, ట్రోస్కీ, వోజ్నియాకి, సిలిచ్ సోంగా, కెర్బర్‌కు చుక్కెదురు లండన్: వింబుల్డన్‌లో మరో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్ పెట్రా క్విటోవా మూడోరౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో 28వ సీడ్ జలెనా జంకోవిచ్ (సెర్బియా) 3-6, 7-5, 6-4తో రెండోసీడ్ క్విటోవా (చెక్)పై సంచలన విజయం సాధించింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలిసెట్ కోల్పోయిన జంకోవిచ్ చివరి రెండు సెట్లలో అద్భుతమైన పోరాటం చేసింది. లభించిన ఒక్క బ్రేక్ పాయింట్‌ను సద్వినియోగం చేసుకోవడంతో పాటు సర్వీస్‌ను నిలబెట్టుకుని క్విటోవా తొలిసెట్‌ను దక్కించుకుంది. రెండోసెట్ ఆరంభంలోనూ సెర్బియన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి క్విటోవా ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఇరువురు సర్వీస్‌లను నిలబెట్టుకున్నా.... ఏడో గేమ్‌లో జంకోవిచ్ రెండు బ్రేక్ పాయింట్లను కాచుకుంది. ఎనిమిదో గేమ్‌లో క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో స్కోరు 4-4తో సమమైంది. మళ్లీ 12వ గేమ్‌లో చెక్ ప్లేయర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను చేజిక్కించుకుంది. నిర్ణయాత్మక మూడోసెట్లో తొమ్మిది గేమ్‌ల వరకు ఇరువురు హోరాహోరీగా పోరాడారు. అయితే స్కోరు 5-4 ఉన్న దశలో క్విటోవా సర్వీస్‌ను కోల్పోవడంతో జంకోవిచ్ విజేతగా నిలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో 5వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-2, 6-2తో 31వ సీడ్ కెమిల్లా గియోర్జి (ఇటలీ)పై; 13వ సీడ్ రద్వాన్‌స్కా (పోలెండ్) 6-1, 6-4తో డెల్లాక్వా (అమెరికా)పై; 15వ సీడ్ బాసిన్స్కి (స్విట్జర్లాండ్) 6-3, 6-2తో 18వ సీడ్ లిసికి (జర్మనీ)పై; 20వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 7-6 (12), 1-6, 6-2తో 10వ సీడ్ కెర్బర్ (జర్మనీ)పై; 21వ సీడ్ కీస్ (అమెరికా) 6-4, 6-4తో తట్జానా మరియా (జర్మనీ)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. సోంగాకు షాక్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో జో విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్)కు చుక్కెదురైంది. 23వ సీడ్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా) 7-6 (3), 4-6, 7-6 (2), 7-6 (9)తో సోంగాపై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో రెండోసీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-4, 6-4, 6-7 (5), 6-2తో సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)పై; 9వ సీడ్ మార్లిన్ సిలిచ్ (క్రొయేషియా) 7-6 (4), 6-7 (6), 6-4, 6-7 (4), 12-10తో 17వ సీడ్ ఇస్నేర్ (అమెరికా)పై; 20వ సీడ్ అగుట్ (స్పెయిన్) 7-6 (4), 6-0, 6-1తో బాసిలాషివిల్లి (జార్జియా)పై; 22వ సీడ్ ట్రోస్కీ (సెర్బియా) 6-4, 7-6 (3), 4-6, 6-3తో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడి మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి 6-0, 6-1తో డేట్ క్రుమ్న్ (జపాన్)-షియావోన్ (ఇటలీ)పై నెగ్గి ప్రిక్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మిక్స్‌డ్‌లోనూ సానియా-సోరెస్ (బ్రెజిల్) 6-2, 6-4తో బెగ్మెన్ (జర్మనీ)-హుసరోవా (స్లోవేకియా)పై నెగ్గారు. పురుషుల డబుల్స్‌లో 11వ సీడ్ లియాండర్ పేస్-డానియెల్ నెస్టర్ (కెనడా) జోడి... 5-7, 7-6 (3), 7-6 (4), 7-5తో గబాష్విల్లీ (రష్యా)-యెన్ సున్ లూ (తైపీ)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. బాలికల సింగిల్స్ తొలిరౌండ్లో 15వ సీడ్ ఎడ్లపల్లి ప్రాంజల 6-4, 6-2తో హెరాజో గోంజాలెజ్ (కొలంబియా)పై నెగ్గి రెండోరౌండ్లోకి ప్రవేశించింది. -
మూడో రౌండ్‌కు హంపి
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. శనివారం లీ తింగ్జీ (చైనా)తో జరిగిన రెండో రౌండ్ రెండో గేమ్‌లోనూ హంపి విజయం సాధించింది. దీంతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హంపి 42 ఎత్తుల్లో ముగించింది. మరోవైపు ద్రోణవల్లి హారిక, ఇరీనా క్రుష్ (అమెరికా)తో తన రెండో రౌండ్ రెండో గేమ్‌ను కూడా డ్రా చేసుకుంది. నేడు (ఆదివారం) జరిగే టైబ్రేకర్‌లో నెగ్గినవారు మూడో రౌండ్‌కు వెళతారు. -
ఈసారి ఇవనోవిచ్, క్విటోవా...
మూడో రౌండ్లోనే ఓడిన మాజీ విజేత, ఐదో సీడ్ సఫరోవా, కుజ్నెత్సోవా అద్భుత విజయాలు ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఏ ముహూర్తాన ప్రారంభమైందోగాని మహిళల విభాగంలో సీడెడ్ క్రీడాకారిణులకు ఏమాత్రం కలిసిరావడంలేదు. తొలి రోజు మొదలైన అగ్రశ్రేణి క్రీడాకారిణుల పరాజయాల పర్వం శనివారం కూడా కొనసాగింది. ఇప్పటికే టాప్ సీడ్ సెరెనా (అమెరికా), రెండో సీడ్ నా లీ (చైనా), మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) ఇంటిదారి పట్టగా... తాజాగా వీరి సరసన ఐదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), 11వ సీడ్, 2008 చాంపియన్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) చేరారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 23వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-3తో ఇవనోవిచ్‌ను బోల్తా కొట్టించగా... హోరాహోరీ పోరులో 2009 చాంపియన్, 27వ సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) 6-7 (3/7), 6-1, 9-7తో క్విటోవాపై అద్భుత విజయం సాధించింది. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో సెట్టే 92 నిమిషాలు జరగడం విశేషం. 2009లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన తర్వాత స్వెత్లానా మరో 17 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడినా ఏ దాంట్లోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మ్యాచ్ మొత్తంలో స్వెత్లానా నాలుగు ఏస్‌లు సంధించగా... నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, కేవలం 20 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు 2011 వింబుల్డన్ చాంపియన్ క్విటోవా 11 డబుల్ ఫాల్ట్‌లు, 65 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. సిమోనా, జంకోవిచ్ ముందంజ మహిళల సింగిల్స్ ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-3, 6-0తో మరియా తెరెసా (స్పెయిన్)పై, ఆరో సీడ్ జెలెనా జంకోవిచ్ (సెర్బియా) 6-1, 6-2తో 26వ సీడ్ సొరానా కిర్స్టీ (రుమేనియా)పై, 10వ సీడ్ సారా ఎరాని (ఇటలీ) 6-0, 6-1తో గ్లుష్కో (ఇజ్రాయెల్)పై, 15వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6-3, 6-4తో 22వ సీడ్ మకరోవా (రష్యా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. నాదల్, ఫెరర్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్లో నాదల్ 6-2, 7-5, 6-2తో మాయర్ (అర్జెంటీనా)పై, ఫెరర్ 6-2, 7-6 (7/2), 6-3తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)పై గెలిచారు. 23వ సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 5-7, 6-2, 6-4, 0-6, 6-2తో 14వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)ను బోల్తా కొట్టించాడు. ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడి మహిళల డబుల్స్ విభాగంలో ఐదో సీడ్ సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన రెండో రౌండ్లో సానియా-కారా బ్లాక్ జంట 6-1, 6-2తో డబ్రోవ్స్కీ (కెనడా)-రొసోల్‌స్కా (పోలండ్) ద్వయంపై గెలిచింది. తదుపరి మ్యాచ్‌లో జంకోవిచ్ (సెర్బియా)-క్లెబనోవా (రష్యా) జోడితో సానియా జంట తలపడుతుంది.