
మూడో రౌండ్‌కు హంపి
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. శనివారం లీ తింగ్‌జీ (చైనా)తో జరిగిన రెండో రౌండ్ రెండో గేమ్‌లోనూ హంపి విజయం సాధించింది. దీంతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హంపి 42 ఎత్తుల్లో ముగించింది. మరోవైపు ద్రోణవల్లి హారిక, ఇరీనా క్రుష్ (అమెరికా)తో తన రెండో రౌండ్ రెండో గేమ్‌ను కూడా డ్రా చేసుకుంది. నేడు (ఆదివారం) జరిగే టైబ్రేకర్‌లో నెగ్గినవారు మూడో రౌండ్‌కు వెళతారు.