the World Womens Chess Championship
-
ప్రిక్వార్టర్స్‌కు హారిక
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ సోచి (రష్యా): నిర్ణాయక టైబ్రేక్‌లలో తన సత్తా చాటుకున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఇరీనా క్రుష్‌తో జరిగిన రెండో రౌండ్లో హారిక టైబ్రేక్‌లో 1.5-0.5తో విజయం సాధించి ముందంజ వేసింది. శనివారం నిర్ణీత రెండు గేమ్‌లు ముగిసిన తర్వాత వీరిద్దరు 1-1తో సమఉజ్జీగా నిలిచారు. దాంతో ఫలితం తేలడానికి ఆదివారం రెండు టైబ్రేక్ గేమ్‌లను నిర్వహించారు. తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 70 ఎత్తుల్లో గెలుపొంది... తెల్ల పావులతో ఆడిన రెండో గేమ్‌ను 58 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో హారిక ఆడుతుంది. మరోవైపు ఈ టోర్నీలో ఆడిన నాలుగు గేముల్లోనూ నెగ్గిన కోనేరు హంపి ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో అలీసా గలియమోవా (రష్యా)తో తలపడుతుంది. -
మూడో రౌండ్‌కు హంపి
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. శనివారం లీ తింగ్జీ (చైనా)తో జరిగిన రెండో రౌండ్ రెండో గేమ్‌లోనూ హంపి విజయం సాధించింది. దీంతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హంపి 42 ఎత్తుల్లో ముగించింది. మరోవైపు ద్రోణవల్లి హారిక, ఇరీనా క్రుష్ (అమెరికా)తో తన రెండో రౌండ్ రెండో గేమ్‌ను కూడా డ్రా చేసుకుంది. నేడు (ఆదివారం) జరిగే టైబ్రేకర్‌లో నెగ్గినవారు మూడో రౌండ్‌కు వెళతారు. -
హంపి గెలుపు, హారిక గేమ్ ‘డ్రా’
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన విజయపరంపర కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 66 ఎత్తుల్లో లీ తింగ్జి (చైనా)పై గెలిచింది. శనివారం జరిగే రెండో గేమ్‌ను హంపి కనీసం ‘డ్రా’ చేసుకున్నా మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తన రెండో రౌండ్ తొలి గేమ్‌ను ఇరీనా క్రుష్ (అమెరికా)తో 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. -
రెండో రౌండ్‌కు హంపి, హారిక
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో హంపి 2-0తో అయా మొతాజ్ (ఈజిప్టు)పై, హారిక 2-0తో తతేవ్ అబ్రహమియాన్ (అమెరికా)పై విజయం సాధించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ రెండో గేమ్‌లో హంపి 28 ఎత్తుల్లో అయా మొతాజ్ను ఓడించగా... హారిక 51 ఎత్తుల్లో తతేవ్ అబ్రహమియాన్పై గెలిచింది. భారత్‌కే చెందిన మేరీ ఆన్ గోమ్స్ తన ప్రత్యర్థి తాతియానా కొసిన్‌త్సెవా (రష్యా)తో జరిగిన రెండో గేమ్‌ను 24 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. వీరిద్దరి మధ్య జరిగిన రెండు గేమ్‌లూ ‘డ్రా’ కావడంతో విజేతను నిర్ణయించడానికి గురువారం టైబ్రేక్‌ను నిర్వహిస్తారు. శుక్రవారం నుంచి రెండో రౌండ్ పోటీలు జరుగుతాయి. -
హంపి, హారిక శుభారంభం
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక శుభారంభం చేశారు. అయా మొతాజ్ (ఈజిప్టు)తో మంగళవారం జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌లో టాప్ సీడ్ హంపి 31 ఎత్తుల్లో విజయం సాధించగా... హారిక 57 ఎత్తుల్లో తతేవ్ అబ్రహమియాన్ (అమెరికా)ను ఓడించింది. తొలి రౌండ్ ప్రత్యర్థులతోనే బుధవారం జరిగే రెండో గేమ్‌ను హంపి, హారిక కనీసం ‘డ్రా' చేసుకున్నా రెండో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం గురువారం టైబ్రేక్ గేమ్‌లను నిర్వహిస్తారు. మేరీ ఆన్ గోమ్స్ (భారత్), తాతియానా కొసిన్‌త్సెవా (రష్యా)ల మధ్య జరిగిన మరో తొలి రౌండ్ గేమ్ 80 ఎత్తుల్లో ‘డ్రా'గా ముగిసింది.