న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. న్యూయార్క్‌లో జరిగిన మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం మర్యాదపూర్వకంగా ప్రధానితో భేటీ అయ్యింది.
ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసలు కురిపించిన మోదీ... హంపి క్రీడా దిగ్గజమని కొనియాడారు. ‘హంపిలాంటి స్పోరి్టంగ్ ఐకాన్‌ను కలవడం ఆనందంగా ఉంది. చెస్‌ప్లేయర్లకు ఆమె ఒక స్ఫూర్తి. చురుకైన ఆలోచన, అచంచల సంకల్పం, నిబద్ధత వల్లే ఆమె ఈ స్థాయికి చేరుకుంది. దేశానికే ఆమె గర్వకారణం’ అని ప్రధాని ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
మోదీతో భేటీ కావడం, ఆయన కురిపించిన ప్రశంసలు, ప్రోత్సహించిన తీరు తనలో నూతనోత్సహాన్ని నింపిందని హంపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment