
మోంటెకార్లో (మొనాకో): మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ మూడో టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ స్టార్ కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. గురువారం మొనాకాలో ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హంపి, అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా), బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను నిర్ధారించగా... గొర్యాక్‌చినాకు టైటిల్ ఖరారైంది. హంపి రన్నరప్‌గా నిలిచింది. మున్‌గున్‌తుల్‌కు మూడో స్థానం లభించింది. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో హంపి 55 ఎత్తుల్లో బీబీసారా అసాబయెవా (కజకిస్తాన్)పై గెలిచింది. ఇదే టోర్నీలో ఆడిన హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment