
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతిలకు ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు హరికృష్ణ 52 ఎత్తుల్లో కిరిల్ అలెక్‌సీన్‌కో (రష్యా) చేతిలో... మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ 93 ఎత్తుల్లో సో వెస్లీ (అమెరికా) చేతిలో ఓటమి చవిచూశారు. ప్రిక్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే... నేడు జరిగే రెండో గేమ్‌లో హరికృష్ణ, విదిత్ తప్పనిసరిగా గెలవాల్సిందే. వీరిద్దరు కనీసం ‘డ్రా’ చేసుకున్నా ఈ టోర్నీలో భారత కథ ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment