Harikrishna pentela
-
గెలిస్తేనే నిలుస్తారు
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతిలకు ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు హరికృష్ణ 52 ఎత్తుల్లో కిరిల్ అలెక్‌సీన్‌కో (రష్యా) చేతిలో... మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ 93 ఎత్తుల్లో సో వెస్లీ (అమెరికా) చేతిలో ఓటమి చవిచూశారు. ప్రిక్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే... నేడు జరిగే రెండో గేమ్‌లో హరికృష్ణ, విదిత్ తప్పనిసరిగా గెలవాల్సిందే. వీరిద్దరు కనీసం ‘డ్రా’ చేసుకున్నా ఈ టోర్నీలో భారత కథ ముగుస్తుంది. -
హరికృష్ణ హ్యాట్రిక్ విజయం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ రెండో రౌండ్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ తొలి గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణతోపాటు నిహాల్ సరీన్ గెలుపొందగా... విదిత్, ఆధిబన్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మరోప్లేయర్ అరవింద్ చిదంబరం ఓడిపోయాడు. హరికృష్ణ 54 ఎత్తుల్లో వ్లాదిమిర్ ఫెడోసీవ్ (రష్యా)పై, నిహాల్ 37 ఎత్తుల్లో సఫార్లి ఎల్తాజ్ (అజర్బైజాన్)పై నెగ్గారు. నేడు హరికృష్ణ, నిహాల్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంటే మూడో రౌండ్‌కు అర్హత పొందుతారు. ఈ టోర్నీలో హరికృష్ణకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. విదిత్–రఖ్మనోవ్ (రష్యా) గేమ్ 31 ఎత్తుల్లో; ఆధిబన్–యు యాంగీ (చైనా) గేమ్ 55 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. అరవింద్ 37 ఎత్తుల్లో తొమవ్స్కీ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
సంయుక్తంగా మూడో స్థానంలో హరికృష్ణ, ఆనంద్
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో తొమ్మిది రౌండ్లు ముగిశాక భారత గ్రాండ్‌మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, విశ్వనాథన్ ఆనంద్ 5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. హరికృష్ణ ఆడిన తొమ్మిది గేముల్లో మూడింట గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రజ్ఞానంద, సూర్యశేఖర గంగూలీ, లెవాన్ అరోనియన్‌లపై నెగ్గిన హరికృష్ణ... మమెదైరోవ్, సెర్గీ కర్జాకిన్, ఆనంద్, విదిత్‌లతో గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. నకముర, సో వెస్లీలతో జరిగిన గేముల్లో హరికృష్ణకు ఓటమి ఎదురైంది. 6.5 పాయింట్లతో నకముర (అమెరికా) ఒంటరిగా ఆధిక్యంలో ఉండగా... సో వెస్లీ (అమెరికా) 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. నేడు మిగతా తొమ్మిది రౌండ్లు జరుగుతాయి. -
రెండో స్థానంలో హరికృష్ణ
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ ర్యాపిడ్ టోర్నమెంట్లో ఆరో రౌండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 3.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రెండో రోజు జరిగిన మూడు గేమ్‌లను కూడా హరికృష్ణ ‘డ్రా’గా ముగించడం విశేషం. నిహాల్ సరీన్ (భారత్)తో జరిగిన నాలుగో గేమ్‌ను 51 ఎత్తుల్లో... విశ్వనాథన్ ఆనంద్ (భారత్)తో జరిగిన ఐదో గేమ్‌ను 38 ఎత్తుల్లో... సో వెస్లీ (అమెరికా)తో జరిగిన ఆరో గేమ్‌ను 50 ఎత్తుల్లో హరికృష్ణ ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రస్తుతం 4.5 పాయింట్లతో హికారు నకముర (అమెరికా), లెవాన్ అరోనియన్ (అర్మేనియా) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడు పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. ఆదివారం చివరి రౌండ్ మూడు గేమ్‌లు జరుగుతాయి. కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ ర్యాపిడ్ టోర్నమెంట్లో ఆరో రౌండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 3.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రెండో రోజు జరిగిన మూడు గేమ్‌లను కూడా హరికృష్ణ ‘డ్రా’గా ముగించడం విశేషం. నిహాల్ సరీన్ (భారత్)తో జరిగిన నాలుగో గేమ్‌ను 51 ఎత్తుల్లో... విశ్వనాథన్ ఆనంద్ (భారత్)తో జరిగిన ఐదో గేమ్‌ను 38 ఎత్తుల్లో... సో వెస్లీ (అమెరికా)తో జరిగిన ఆరో గేమ్‌ను 50 ఎత్తుల్లో హరికృష్ణ ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రస్తుతం 4.5 పాయింట్లతో హికారు నకముర (అమెరికా), లెవాన్ అరోనియన్ (అర్మేనియా) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడు పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. ఆదివారం చివరి రౌండ్ మూడు గేమ్‌లు జరుగుతాయి. -
రెండో రౌండ్లో హరికృష్ణ
బాకు (అజర్బైజాన్) : ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మాక్స్ ఇల్లింగ్‌వర్త్ (ఆస్ట్రేలియా)తో జరిగిన పోటీలో హరికృష్ణ 2-0తో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన తొలి గేమ్‌లో 72 ఎత్తుల్లో నెగ్గిన హరికృష్ణ, శనివారం జరిగిన రెండో గేమ్‌లో 59 ఎత్తుల్లో గెలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన లలిత్ బాబు తొలి రౌండ్లో 0.5-1.5తో రాడోస్లావ్ వొటాసెక్ (పోలండ్) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో భారత్‌కే చెందిన సేతురామన్‌తో హరికృష్ణ తలపడతాడు.