రెండో రౌండ్‌లో హరికృష్ణ | Harikrishna in the second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో హరికృష్ణ

Published Sun, Sep 13 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

Harikrishna in the second round

బాకు (అజర్‌బైజాన్) : ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మాక్స్ ఇల్లింగ్‌వర్త్ (ఆస్ట్రేలియా)తో జరిగిన పోటీలో హరికృష్ణ 2-0తో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన తొలి గేమ్‌లో 72 ఎత్తుల్లో నెగ్గిన హరికృష్ణ, శనివారం జరిగిన రెండో గేమ్‌లో 59 ఎత్తుల్లో గెలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన లలిత్ బాబు తొలి రౌండ్‌లో 0.5-1.5తో రాడోస్లావ్ వొటాసెక్ (పోలండ్) చేతిలో  ఓడిపోయాడు. రెండో రౌండ్‌లో భారత్‌కే చెందిన సేతురామన్‌తో హరికృష్ణ తలపడతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement