బకూ (అజర్‌బైజాన్): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో రెండో రౌండ్‌కు చేరుకుంది. మరీనా బ్రునెల్లో (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్‌లో ప్రియాంక ర్యాపిడ్ ఫార్మాట్ టైబ్రేక్‌లో 1.5–0.5తో గెలుపొందింది.
టైబ్రేక్ తొలి గేమ్‌ను 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న ప్రియాంక, రెండో గేమ్‌లో 45 ఎత్తుల్లో మరీనాను ఓడించి ఓవరాల్‌గా 2.5–1.5తో విజయం అందుకుంది. క్లాసికల్ ఫార్మాట్‌లో వీరి ద్దరి మధ్య జరిగిన తొలి రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్ గేమ్‌లను నిర్వహించారు.
రెండో రౌండ్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కోనేరు హంపితో ప్రియాంక తలపడుతుంది. ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి కథ తొలి రౌండ్‌లోనే ముగిసింది. లెవాన్ పాంట్‌సులెయ (జార్జియా)తో టైబ్రేక్ తొలి గేమ్‌లో హర్ష 75 ఎత్తుల్లో ఓడిపోయి, రెండో గేమ్‌ను 66 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని 0.5–1.5తో ఓటమి చవిచూశాడు.
Comments
Please login to add a commentAdd a comment