చెన్నై: ఆంధ్రప్రదేశ్ మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఊహించని పరిణామంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ గేమ్ సందర్భంగా ఆమె ధరించిన బ్లేజర్ జేబులో ఇయర్ బడ్స్ ఉండటంతో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) వేటు వేసింది.
20 ఏళ్ల ప్రియాంకను మిగతా రౌండ్లు ఆడకుండా టోర్నీ నుంచి పంపించింది. అధునాతన సాంకేతిక పరికరాలతో మోసపూరిత ఆట ఆడే అవకాశం ఉండటంతో స్మార్ట్ పరికరాలకు అనుమతి లేదు. ‘ఆమె గేమ్‌లో చీటింగ్‌కు పాల్పడలేదు. కానీ నిషేధిత పరికరాలతో హాల్‌లోకి ప్రవేశించరాదని కఠిన నిబంధనలున్నాయి. వీటిని ఉల్లంఘించడంవల్లే ప్రియాంకపై వేటు వేశాం’ అని ‘ఫిడే’ తెలిపింది.
చదవండి: T20 WC- Semi Finalists: ప్రపంచకప్.. సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే! ఇక విజేతగా..: సచిన్ టెండుల్కర్
FIFA U17 Womens World Cup: ప్రపంచకప్ నుంచి వట్టి చేతులతో నిష్క్రమించిన భారత్
Comments
Please login to add a commentAdd a comment