కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ ర్యాపిడ్ టోర్నమెంట్‌లో ఆరో రౌండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 3.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రెండో రోజు జరిగిన మూడు గేమ్‌లను కూడా హరికృష్ణ ‘డ్రా’గా ముగించడం విశేషం. నిహాల్ సరీన్ (భారత్)తో జరిగిన నాలుగో గేమ్‌ను 51 ఎత్తుల్లో... విశ్వనాథన్ ఆనంద్ (భారత్)తో జరిగిన ఐదో గేమ్‌ను 38 ఎత్తుల్లో... సో వెస్లీ (అమెరికా)తో జరిగిన ఆరో గేమ్‌ను 50 ఎత్తుల్లో హరికృష్ణ ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రస్తుతం 4.5 పాయింట్లతో హికారు నకముర (అమెరికా), లెవాన్ అరోనియన్ (అర్మేనియా) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడు పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. ఆదివారం చివరి రౌండ్ మూడు గేమ్‌లు జరుగుతాయి.

Comments
Please login to add a commentAdd a comment