టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్-2025కు ఎండ్ కార్డ్ పడింది. ఈ టోర్నీ విజేతగా భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద(Praggnanandhaa) నిలిచాడు. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ వేదికగా జరిగిన టై బ్రేకర్‌లో వరల్డ్ ఛాంపియన్ డి గుకేశ్‌పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. కాగా అంతకుముందు చివరి రౌండ్‌లో గుకేశ్, ప్రజ్ఞానానంద ఇద్దరూ తమ మ్యాచ్‌లలో ఓటమి చవిచూశారు.
జర్మన్ గ్రాండ్ మాస్టర్ జీఎమ్ విన్సెంట్ ప్రగ్నందందాను ఓడించగా.. గుకేష్‌ను అర్జున్ ఎరిగైసి ఖంగుతిన్పించాడు. దీంతో 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న గుకేశ్, ప్రజ్ఞానంద.. టైటిల్ కోసం టైబ్రేకర్‌లో తలపడ్డారు. టైబ్రేకర్‌లో తొలి గేమ్‌లో గుకేష్ విజయం సాధించగా, రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద గెలుపొందాడు.
ఫలితంగా విజేతను తేల్చేందుకు సడన్ డెత్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో ప్రజ్ఞానంద విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీ చివరి రౌండ్(13వ రౌండ్)లో ప్రజ్ఞానంద 2741 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలవగా.. దొమ్మరాజు గుకేశ్(2777) రెండో స్ధానంలో నిలిచాడు.
చదవండి: టీ20 వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే?
Comments
Please login to add a commentAdd a comment