
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ అమెరికన్ టీనేజ్ స్టార్ కోకో గౌఫ్ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీ ఫైనల్ దశకు అర్హత సాధించింది. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో అమెరికాకు చెందిన 18 ఏళ్ల కోకో గౌఫ్ తన జోరు కొనసాగిస్తూ వరుసగా ఐదో మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఒక్క సెట్ కోల్పోకుండా విజయం సాధించింది.
2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, 64వ ర్యాంకర్ స్లోన్ స్టీఫెన్స్(అమెరికా)తో మంగళవారం జరిగిన సింగిల్వ్ క్వార్టర్ ఫైనల్లో 18వ సీడ్, ప్రపంచ 23వ ర్యాంకర్ కోకో 7-5, 6-2తో గెలుపొందింది. నాలుగేళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారి ఇప్పటివరకు 11 గ్రాండ్‌స్లామ్‌లు ఆడిన కోకో గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇదే టోర్నీలో ఈసారి క్వార్టర్స్ అడ్డంకిని అధిగమించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు అర్హత సాధించింది.
🇺🇸🆚🇺🇸
— Roland-Garros (@rolandgarros) May 31, 2022
Teenager @CocoGauff came out on top against fellow American Sloane Stephens in a hard-fought quarter-final:#RolandGarros pic.twitter.com/kQphuXxVva