సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 మహిళల టెన్నిస్ టోర్నీ ఫైనల్లో అమెరికా టీనేజర్, 19 ఏళ్ల కోకో గాఫ్ 6–3, 6–4తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి తన కెరీర్‌లో తొలి మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
కోకో గాఫ్‌కు 4,54,500 డాలర్ల (రూ. 3 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది ఈ గెలుపుతో 55 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన టీనేజ్ ప్లేయర్‌గా కోకో గుర్తింపు పొందింది. 1968లో అమెరికాకే చెందిన 17 ఏళ్ల లిండా టుయెరో విజేతగా నిలిచింది.
లెక్క సరిచేసిన జొకోవిచ్
ఒహాయో: సెర్బియా టెన్నిస్ యోధుడు జొకోవిచ్ తన కెరీర్‌లో 39వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్ అల్‌కరాజ్ (స్పెయిన్)తో 3 గంటల 49 నిమిషాలపాటు జరిగిన సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ 5–7, 7–6 (9/7), 7–6 (7/4)తో గెలుపొందాడు.
రెండో సెట్ టైబ్రేక్‌లో జొకోవిచ్ ఒక మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 10,19,335 డాలర్ల (రూ. 8 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో అల్‌కరాజ్ చేతిలో ఎదురైన ఓటమికి జొకోవిచ్ బదులు తీర్చుకున్నాడు. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్‌లో ఇది 95వ సింగిల్స్ టైటిల్‌కాగా, కెరీర్‌లో 1,069వ విజయం.
Comments
Please login to add a commentAdd a comment