ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్
బాసెల్ (స్విట్జర్లాండ్): మాజీ చాంపియన్ పీవీ సింధు స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–12, 21–13తో పోర్న్‌పిచా చొయ్‌కీవోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది.
ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ తొమోకా మియజకీతో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా తొలి రౌండ్‌లో విజయాలు అందుకున్నారు. 2015లో స్విస్ ఓపెన్ విజేతగా నిలిచిన శ్రీకాంత్ 21–17, 21–18తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై నెగ్గగా... లక్ష్య సేన్ 21–19, 15–21, 21–11తో లియోంగ్ జున్ హావో (మలేసియా)ను ఓడించాడు.
మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీలు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. తొలి రౌండ్‌లో అశి్వని–తనీషా ద్వయం 21–18, 12–21, 21–19తో మెలీసా పుస్పితాసారి–రేచల్ రోజ్ (ఇండోనేసియా) జంటపై... గాయత్రి–ట్రెసా జోడీ 21–15, 21–12తో అనీ జు–కెరీ జు (అమెరికా) ద్వయంపై గెలుపొందాయి.
Comments
Please login to add a commentAdd a comment