సాయిప్రణీత్ శుభారంభం | Sai Praneeth started | Sakshi
Sakshi News home page

సాయిప్రణీత్ శుభారంభం

Published Wed, Nov 30 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

సాయిప్రణీత్ శుభారంభం

సాయిప్రణీత్ శుభారంభం

మకావు: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన భారత బ్యాడ్మింటన్ యువతార భమిడిపాటి  సాయిప్రణీత్ మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సారుుప్రణీత్ కేవలం 19 నిమిషాల్లో 21-3, 21-8తో లామ్ హూ హిమ్ (మకావు)పై గెలిచాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ 21-11, 21-16తో మిలాన్ లుదిక్ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గగా... పారుపల్లి కశ్యప్‌కు తన ప్రత్యర్థి సిమ్ గు జెంగ్ (మలేసియా) నుంచి వాకోవర్ లభించింది.

చున్ వీ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 2-6తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగాడు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో చున్ వీ చెన్‌తో కశ్యప్; మొహమ్మద్ బాయు (ఇండోనేసియా)తో సమీర్ వర్మ; సున్ ఫిజియాంగ్ (చైనా)తో సారుుప్రణీత్... మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో హనా రమాదిని (ఇండోనేసియా)తో టాప్ సీడ్ సైనా నెహ్వాల్ తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement