
బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్ ఇండియా ఓపెన్ నుంచి భారత అగ్రశ్రేణి ప్లేయర్, హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ వైదొలిగాడు. ఆదివారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో సాయిప్రణీత్‌కు పాజిటివ్ రావడంతో... మంగళవారం నుంచి న్యూఢిల్లీలో జరిగే ఈ టోర్నీ నుంచి అతను తప్పుకున్నాడు. ‘రెండు రోజుల నుంచి నాకు దగ్గు, జలుబు ఉంది. కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను’ అని సాయిప్రణీత్ తెలిపాడు.