India Open tournament
-
సింధు ఇంటికి... సైనా ముందుకు
న్యూఢిల్లీ: ఈ ఏడాది వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నీలోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. గతవారం మలేసియా ఓపెన్ టోర్నీలోనూ సింధు తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 45 నిమిషాల్లో 12–21, 20–22తో ప్రపంచ 30వ ర్యాంకర్ సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. గత ఏడాది ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్లో సుపనిద చేతిలోనే ఓడిపోయిన సింధుకు ఈసారీ అదే ఫలితం ఎదురైంది. మరోవైపు భారత్‌కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించింది. ప్రపంచ 24వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో 63 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–17, 12–21, 21–19తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లక్ష్య సేన్ శుభారంభం పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్య సేన్ (భారత్) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో లక్ష్య సేన్ 21–14, 21–15తో భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. గతవారం మలేసియా ఓపెన్ తొలి రౌండ్ లో ప్రణయ్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. సాత్విక్ జోడీ ముందంజ పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపి యన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–15తో మాథ్యూ–క్రిస్టోఫర్ గ్రిమ్లే (స్కాట్లాండ్) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) జోడీ 21–11, 23–25, 21–9తో రూబెన్ జిలీ–టియెస్ వాన్ డెర్ (నెదర్లాండ్స్) ద్వయంపై నెగ్గింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట 22–20, 17–21, 21–18తో మార్గోట్ లాంబర్ట్–ఆనీ ట్రాన్ (ఫ్రాన్స్) జోడీపై గెలుపొందగా... సిక్కి రెడ్డి–శ్రుతి మిశ్రా (భారత్) ద్వయం 17–21, 19–21తో లిండా ఎఫ్లెర్–ఇసాబెల్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. చదవండి: IND vs NZ 1st ODI: టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ -
ఇండియా ఓపెన్ టోర్నీ.. సింధు సత్తాకు సవాల్
న్యూఢిల్లీ: స్వదేశంలో మరోసారి సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్, సైనా నెహ్వాల్ నేటి నుంచి మొదలయ్యే ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో బరిలోకి దిగనున్నారు. మాజీ చాంపియన్ పీవీ సింధు నేడు జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 21వ ర్యాంకర్ సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)తో... ప్రపంచ 31వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో సైనా నెహ్వాల్ తలపడనున్నారు. గత ఏడాది ఇదే టోర్నీ సెమీఫైనల్లో సుపనిద చేతిలో సింధు ఓడిపోగా... మియా బ్లిచ్‌ఫెల్ట్‌తో గతంలో ఆడిన రెండుసార్లూ సైనాకు ఓటమి ఎదురైంది. ఈ నేపథ్యంలో సింధు, సైనాలకు తొలి రౌండ్లోనే కఠిన పరీక్ష ఎదురుకానుంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్య సేన్ భారత్‌కే చెందిన ప్రణయ్‌తో తొలి రౌండ్లో ఆడనున్నాడు. గతవారం మలేసియా ఓపెన్ టోర్నీ తొలి రౌండ్లో వీరిద్దరు తలపడగా ప్రణయ్ పైచేయి సాధించాడు. బుధవారం జరిగే మరో తొలి రౌండ్ లో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో కిడాంబి శ్రీకాంత్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 3–9తో వెనుకంజలో ఉన్నాడు. చదవండి: Australian Open 2023: శ్రమించి... శుభారంభం India Open - The biggest badminton tournament held in India will see the world's best players in action in Delhi from 17 January. 🏸@BAI_Media #IndiaOpen pic.twitter.com/cM4ZiB3lFm — Doordarshan Sports (@ddsportschannel) January 16, 2023 -
India Open 2022: ప్రపంచ ఛాంపియన్స్‌కు షాకిచ్చిన భారత ఆటగాళ్లు
India Open 2022: భారత క్రీడాకారుడు లక్ష్యసేన్ ఇండియా ఓపెన్-2022 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్యూను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో లక్ష్యసేన్ లోహ్ కీన్యూపై 24-22, 21-17 తేడాతో గెలుపొందాడు. 54 నిమిషాలపాటు సాగిన ఈ గేమ్‌లో వరుస రెండు సెట్లలో విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో లక్ష్యసేన్ తన తొలి సూపర్ 500 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ టైటిల్ గెలుచుకున్న మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. Take a bow for the Men’s Singles champions! 🔥🔥👏 🥇: @lakshya_sen 🥈: @reallohkeanyew #YonexSunriseIndiaOpen2022 #IndiaKaregaSmash #Badminton pic.twitter.com/iM9wkpiDLD — BAI Media (@BAI_Media) January 16, 2022 ఇండియా ఓపెన్ డబుల్స్ ఫైనల్లో చిరాగ్‌శెట్టి- సాత్విక్ సాయిరాజ్ జోడి మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్లు అయిన ఇండోనేషియాకు చెందిన మహ్మద్ అహ్పాన్, హెండ్రా సెటియావాన్‌లను ఓడించి టైటిల్‌ను గెలుపొందారు. ఫైనల్లో ఈ జోడి వరుస సెట్లలో అద్భుతమైన ఆటతీరుతో 21-16, 26-24 తేడాతో గెలుపొందింది. Put your hands together for the Men’s doubles champions! 🇮🇳 🇮🇩 👏👏🔝 🥇: @satwiksairaj & @Shettychirag04 🥈: Mohammad Ahsan & Hendra Setiwan#YonexSunriseIndiaOpen2022 #IndiaKaregaSmash #Badminton pic.twitter.com/hHC4i5ybOE — BAI Media (@BAI_Media) January 16, 2022 చదవండి: (విరాట్ కోహ్లి రిటైర్మెంట్.. స్పందించిన పుజారా) -
సాయిప్రణీత్‌కు కరోనా పాజిటివ్
బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్ ఇండియా ఓపెన్ నుంచి భారత అగ్రశ్రేణి ప్లేయర్, హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ వైదొలిగాడు. ఆదివారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో సాయిప్రణీత్‌కు పాజిటివ్ రావడంతో... మంగళవారం నుంచి న్యూఢిల్లీలో జరిగే ఈ టోర్నీ నుంచి అతను తప్పుకున్నాడు. ‘రెండు రోజుల నుంచి నాకు దగ్గు, జలుబు ఉంది. కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను’ అని సాయిప్రణీత్ తెలిపాడు. -
సిరిల్ వర్మతో శ్రీకాంత్ తొలి పోరు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు జరిగే ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ‘డ్రా’ను నిర్వాహకులు గురువారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్ తన తొలి మ్యాచ్‌ను హైదరాబాద్‌కు చెందిన సిరిల్ వర్మ (భారత్)తో ఆడతాడు. సెమీఫైనల్ వరకు చేరుకోవడం శ్రీకాంత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే సెమీఫైనల్లో శ్రీకాంత్‌కు ప్రపంచ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్) ఎదురవుతాడు. స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో లో కీన్ యు చేతిలోనే శ్రీకాంత్ ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. మరో భారత షట్లర్ సాయిప్రణీత్ తన తొలి మ్యాచ్‌లో లూయిస్ ఎన్రిక్ (స్పెయిన్)తో ఆడనున్నాడు. మహిళల విభాగంలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్న తెలుగు తేజం పీవీ సింధుకు సులువైన ‘డ్రా’ లభించింది. భారత్‌కే చెందిన శ్రీ కృష్ణప్రియతో సింధు తన తొలి మ్యాచ్ ను ఆడుతుంది. ఈ ఏడాది మొత్తం గాయాలతో ఇబ్బంది పడ్డ సైనా నెహ్వాల్... ఆరంభ మ్యాచ్‌లో ఐరిస్ వాంగ్ (అమెరికా)తో ఆడుతుంది. చదవండి: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ బోణీ.. 16 పాయింట్లతో మెరిసిన నవీన్ -
సెమీస్‌లో ప్రసాద్
గువాహటి: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల 52 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నేపాల్‌కు చెందిన తేజ్ బహదూర్ దేబాపై ప్రసాద్ విజయం సాధించాడు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన ఆసియా చాంపియన్ అమిత్ ఫంగల్, సచిన్ సివాచ్, గౌరవ్ సోలంకి కూడా సెమీఫైనల్‌కు చేరారు. దాంతో ఈ విభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు భారత్ ఖాతాలోకే చేరనున్నాయి. -
సింధు, శ్రీకాంత్ శుభారంభం
న్యూఢిల్లీ: మాజీ చాంపియన్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సింధు 21–8, 21–13తో ముగ్ధా ఆగ్రే (భారత్)పై... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 21–16, 18–21, 21–19తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ 21–18, 21–12తో రాస్ముస్ గెమ్కె (డెన్మార్క్)పై, సాయిప్రణీత్ 22–24, 21–18, 21–8తో కార్తికేయ్ (భారత్)పై, కశ్యప్ 14–21, 21–18, 21–10తో లీ చెయుక్ (హాంకాంగ్)పై, శుభాంకర్ 14–21, 22–20, 21–11తో నాలుగో సీడ్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై, ప్రణయ్ 14–21, 21–18, 21–14తో వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్)పై గెలిచారు. సుగియార్తోతో జరిగిన మ్యాచ్‌లో శుభాంకర్ రెండో గేమ్‌లో 12–19తో వెనుకబడిన దశలో వరుసగా ఏడు పాయింట్లు స్కోరు చేసి 19–19తో సమం చేశాడు. ఆ తర్వాత మరో పాయింట్ కోల్పోయినా... వెంటనే తేరుకొని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను దక్కించుకున్నాడు. మూడో గేమ్‌లో శుభాంకర్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. భారత్‌కే చెందిన రాహుల్ యాదవ్ 14–21, 6–21తో జార్గెన్‌సన్ (డెన్మార్క్) చేతిలో, అజయ్ జయరామ్ 15–21, 18–21తో వాంగ్జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గుమ్మడి వృశాలి 21–17, 20–22, 12–21తో చనాన్‌చిదా (థాయ్‌లాండ్) చేతిలో, సాయిఉత్తేజిత 9–21, 6–21తో రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో... ప్రాషి జోషి 12–21, 15–21తో హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా 21–14, 21–13తో గ్రాచెవ్–బొలొతోవా (రష్యా)లపై; మనీషా–అర్జున్ 21–15, 21–15తో సుమీత్ రెడ్డి–పూజాలపై గెలిచారు. -
ఇండియా ఓపెన్ నుంచి వైదొలిగిన సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ వేదికగా ఈనెల 26 నుంచి జరిగే ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వైదొలిగింది. కడుపు నొప్పి నుంచి తాను ఇంకా కోలుకోలేదని... అందుకే ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)కు సైనా సమాచారం ఇచ్చింది. 2015లో ఇండియా ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సైనా వైదొలగడంతో... మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ప్రస్తుతం భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే బరిలో ఉంది. -
ఇండియా ఓపెన్ విజేత సౌరవ్
ముంబై: భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సౌరవ్ 11–9, 5–11, 6–11, 11–7, 12–10తో నికోలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. నిర్ణాయక ఐదో గేమ్‌లో సౌరవ్ 3–7తో, 5–8 తో, 8–10తో వెనుకబడి... ఆ తర్వాత పుంజుకొని వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 12–10తో ఐదో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. -
సైనా ఇంటికి... సింధు సెమీస్‌కి
టాప్ సీడ్ సింధు ఈ సీజన్లో తొలి టైటిల్ దిశగా ఆడుగులు వేస్తోంది. స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్‌లో ఆమె సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కథ క్వార్టర్స్‌లో ముగిసింది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి జోడీ సెమీస్ చేరింది. న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బరిలో భారత్ నుంచి సింగిల్స్‌లో సింధు, డబుల్స్‌లో సిక్కి రెడ్డి మిగిలారు. మిగతా వారంతా క్వార్టర్‌ఫైనల్స్‌కే పరిమితమయ్యారు. ఈ ఏడాది తొలి టైటిల్‌పై కన్నేసిన భారత స్టార్, టాప్ సీడ్ పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోనేసియా టోర్నీ రన్నరప్, నాలుగో సీడ్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌లోనే కంగుతింది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. ఎనిమిదో సీడ్ సాయిప్రణీత్, సమీర్ వర్మ, పారుపల్లి కశ్యప్ పరాజయం చవిచూశారు. శ్రమించిన సింధు... ఈ టోర్నీలో అలవోక విజయాలతో నెగ్గుకొచ్చిన సింధుకు క్వార్టర్స్‌లోనూ అలాంటి ఫలితమే ఎదురవుతుందని తొలి గేమ్‌తో అనిపించింది. కానీ రెండో గేమ్‌లో ఆమె ప్రత్యర్థి బియట్రిజ్ కొరాలెస్ (స్పెయిన్) నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. దీంతో సింధు ఈ టోర్నీలో తొలిసారి మ్యాచ్ గెలిచేందుకు మూడో గేమ్ వరకు పోరాడింది. చివరకు తెలుగు తేజం 21–12, 19–21, 21–11తో గెలుపొందింది. సెమీఫైనల్లో సింధు... ప్రపంచ మూడో ర్యాంకర్ రచనోక్ (థాయ్‌లాండ్)తో తలపడుతుంది. మరో మ్యాచ్‌లో సైనా 10–21, 13–21తో బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఎనిమిదో సీడ్ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 21–8, 21–13తో హన్ చెంగ్‌కాయ్–కా తొంగ్ వీ (చైనా) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్ 15–21, 13–21తో మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా) 21–17, 21–14తో సమీర్ వర్మను ఓడించగా, కశ్యప్‌నకు 16–21, 18–21తో కియావో బిన్ (చైనా) చేతిలో చుక్కెదురైంది. మహిళల డబుల్స్‌లో ఏడో సీడ్ మేఘన–పూర్వీషా జంట 10–21, 15–21తో జోంగ్ కొల్ఫన్ – ప్రజోంగ్జయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో, సిక్కి–అశ్విని జంట 17–21, 21–23తో డు యుయి–యిన్హుయ్ (చైనా) ద్వయం చేతిలో కంగుతిన్నాయి. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని జంట 17–21, 11–21తో క్రిస్టియన్సన్–క్రిస్టినా (డెన్మార్క్) జోడీ చేతిలో, పురుషుల డబుల్స్‌లో మనూ–సుమీత్ రెడ్డి ద్వయం 19–21, 19–21తో ఫెర్నాల్డి–çసుకముల్జో (ఇండోనేసియా) జంట చేతిలో ఓడాయి. -
సెమీస్‌లోకి పీవీ సింధు
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, భారత టాప్ స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి బియాట్రిజ్ కొరల్స్‌పై 21-12, 19-21, 21-11 తేడాతో సింధు విజయం సాధించింది. ఈ విజయంతో సింధు ఇండియా ఓపెన్ సెమీస్‌లోకి మూడోసారి ప్రవేశించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. తొలి సెట్‌ను అలవోకగా గెల్చిన సింధుకు రెండో సెట్లో ప్రత్యర్థి అనూహ్యంగా గట్టిపోటీనిచ్చింది. చివరకు రెండో సెట్లో బియాట్రిజ్ కొరల్స్ పై చేయి సాధించడంతో నిర్ణయాత్మక మూడో సెట్ ఆడాల్సి వచ్చింది. తిరిగి పుంజుకున్న సింధు ఈ సెట్లో ప్రత్యర్ధికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయ కేతనం ఎగురవేసింది. -
భారత్ ‘పసిడి’ పంచ్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత బాక్సర్లు తమ పంచ్ పవర్ చాటుకున్నారు. గురువారం ముగిసిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో మన బాక్సర్లు మొత్తం 18 కేటగిరీలలో కలిపి 8 స్వర్ణాలు, 10 రజతాలు, 23 కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో మేరీకోమ్ (48 కేజీలు), మనీషా (54 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), ప్విలావో బసుమతిరి (64 కేజీలు)... పురుషుల విభాగంలో సంజీత్ (91 కేజీలు), అమిత్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) స్వర్ణ పతకాలను గెలుపొందారు. పురుషుల 49 కేజీల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్ 0–5తో భారత్‌కే చెందిన అమిత్ చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు. 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. 48 కేజీల విభాగం ఫైనల్లో మేరీకోమ్ 4–1తో జోసీ గబుకో (ఫిలిప్పీన్స్)ను ఓడించింది. మహిళల విభాగంలో సోనియా (57 కేజీలు), మీనా కుమారి (54 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు), పూజ (69 కేజీలు), సరితా దేవి (60 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలు గెల్చుకున్నారు. పురుషుల విభాగంలో దినేశ్ (69 కేజీలు), దేవాన్‡్ష జైస్వాల్ (81 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), సల్మాన్ షేక్ (52 కేజీలు) రజత పతకాలు గెలుపొందారు. -
శ్రీకాంత్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సంచలనం నమోదైంది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. మలేసియాకు చెందిన అన్‌సీడెడ్ ఇస్కందర్ జుల్కర్నైన్ వరుస గేముల్లోనే రెండో సీడ్‌కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు, నాలుగో సీడ్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, సాయిప్రణీత్ క్వార్టర్స్ చేరగా... మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో, మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రాతో జత కట్టిన తెలుగు తేజం సిక్కి రెడ్డి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఖేల్ ఖతం... రెండో సీడ్ శ్రీకాంత్ ఆశ్చర్యకరంగా ఓ అన్‌సీడెడ్ ఆటగాడి చేతిలో కంగుతిన్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ ఆటగాడు 19–21, 17–21తో ప్రపంచ 85వ ర్యాంకర్ ఇస్కందర్ జుల్కర్నైన్ చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో సింధు, సైనా జోరు మీదున్నారు. ఇద్దరూ ప్రిక్వార్టర్స్ పోటీల్లోనూ అలవోక విజయాలతో ముందంజ వేశారు. టాప్ సీడ్ సింధు 21–10, 21–14తో లిండా జెట్చిరి (బల్గేరియా)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఇండోనేసియా టోర్నీ రన్నరప్ సైనా నెహ్వాల్ 21–12, 21–11తో లిన్ హొజ్‌మార్క్ జెర్స్ఫెల్డ్ (డెన్మార్క్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21–19, 19–21, 21–12తో క్వాలిఫయర్ శ్రేయాన్‡్ష జైస్వాల్ (భారత్)పై గెలుపొందగా, సమీర్ వర్మ 21–18, 19–21, 21–17తో ఇండోనేసియాకు చెందిన టామీ సుగియార్తోను ఓడించాడు. ఎనిమిదో సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్ 21–10, 21–15తో హూ యున్ (హాంకాంగ్)పై నెగ్గాడు. డబుల్స్‌లో దూసుకెళ్తున్న సిక్కిరెడ్డి మహిళల డబుల్స్‌లో జరిగిన రెండో రౌండ్ పోరులో ఆరో సీడ్ సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 21–9, 21–2తో భారత్‌కే చెందిన మేఘ–సంఘమిత్ర జోడీపై అలవోక విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఎనిమిదో సీడ్ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 21–10, 21–19తో ప్రజక్తా సావంత్ (భారత్)–యోగేంద్రన్ కృష్ణన్ (మలేసియా) జోడీపై గెలిచింది. హైదరాబాద్ యువ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీ 21–13, 21–14తో మూడో సీడ్ తన్ కియన్ మెంగ్–లై పే జింగ్ (మలేసియా) ద్వయానికి షాకిచ్చింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి 21–11, 21–15తో తుషార్ శర్మ–చంద్రభూషణ్ త్రిపాఠిలపై గెలుపొందగా... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 21–13, 18–21, 20–22తో చియా బియావో–వాంగ్ జెకాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సైనా, సింధు ముందంజ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హైదరాబాదీ స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధు ముందంజ వేయగా... పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్. ప్రణయ్, అజయ్ జయరామ్‌లు గాయాలతో తొలిరౌండ్లోనే నిష్క్రమించారు. మిగతా వారిలో కిడాంబి శ్రీకాంత్, భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ గెలుపొందగా... మిక్స్డ్, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి జోడీ, పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి జోడీలు శుభారంభం చేశాయి. అలవోకగా రెండో రౌండ్‌కు... భారత అగ్రశ్రేణి క్రీడాకారిణిలు సింధు, సైనా నెహ్వాల్లిద్దరు తొలి రౌండ్లో తమ డెన్మార్క్ ప్రత్యర్థులపై అలవోక విజయాలు సాధించారు. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్ సింధు 21–10, 21–13తో నటాలియా కొచ్ రొహ్డె (డెన్మార్క్)పై విజయం సాధించింది. కేవలం 33 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించింది. నాలుగో సీడ్ సైనా 21–15, 21–9తో సోఫి హోల్మ్బొయె డహ్ల్ (డెన్మార్క్)పై నెగ్గింది. 41 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. తెలుగమ్మాయి గద్దె రుత్విక శివాని 21–17, 21–10తో అమెలీ హెట్జ్ (డెన్మార్క్)పై గెలుపొందగా, ఆకర్షి కశ్యప్ 14–21, 21–18, 21–14తో భారత్‌కే చెందిన అనూర ప్రభుదేశాయ్‌పై నెగ్గింది. చెమటోడ్చిన సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ శ్రీకాంత్ 21–17, 21–18తో లి చుక్ యి (హాంకాంగ్)పై, పారుపల్లి కశ్యప్ 21–14, 21–18తో హన్స్ క్రిస్టిన్ సోల్బెర్గ్ (డెన్మార్క్)పై గెలిచారు. ఎనిమిదో సీడ్ సాయిప్రణీత్ మాత్రం 21–11, 17–21, 21–17తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)పై చెమటోడ్చి నెగ్గాడు. గాయంతో ఇబ్బందిపడినప్పటికీ మ్యాచ్ ఆడిన ఐదో సీడ్ ప్రణయ్ 4–21, 6–21తో శ్రేయాన్స్ జైస్వాల్ చేతిలో ఓడాడు. టామి సుగియార్తో (ఇండోనేసియా)తో జరిగిన పోరులో అజయ్ జయరామ్ 0–2తో వెనుకంజలో ఉండగా గాయంతో వైదొలిగాడు. సౌరభ్ వర్మకు 19–21, 11–21తో నాలుగో సీడ్ షి యూకి (చైనా) చేతిలో చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ జంట 16–21, 21–17, 21–17తో గ్లొరియా ఎమ్మాన్యుయెల్లే– హఫిజ్ ఫైజల్ (ఇండోనేసియా) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో జతకట్టిన సిక్కిరెడ్డి 21–9, 21–11తో భారత్‌కే చెందిన షీనన్ క్రిస్టియాన్–రియా గజ్జర్ జంటపై గెలుపొందింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి ద్వయం 21–7, 21–13తో ఆదర్శ్ కుమార్–జగదీశ్ యాదవ్ (భారత్)పై, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–18, 21–14తో చంగ్ తక్ చింగ్– హీ చన్ మక్ (హాంకాంగ్) జంటపై నెగ్గగా... మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని ద్వయం 21–9, 21–10తో రాజు మొహమ్మద్ రెహన్–అనీస్ కొస్వార్ (భారత్) జంటపై గెలిచింది. -
మెయిన్ డ్రాకు నందగోపాల్ జోడీ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారులు నందగోపాల్, కృష్ణప్రసాద్ తమ భాగస్వాములతో కలిసి పురుషుల డబుల్స్‌లో మెయిన్ డ్రా ఈవెంట్‌కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో కె.నందగోపాల్–ఫ్రాన్సిల్ ఆల్విన్ (భారత్) జంట 21–13, 21–13తో దీపేశ్ ధమి–రత్నజిత్ తమంగ్ (నేపాల్) ద్వయంపై గెలుపొందగా, కృష్ణప్రసాద్–ధ్రువ్ కపిల జోడీ 21–11, 21–15తో భారత్‌కే చెందిన సిద్ధార్థ్–ప్రేమ్ సింగ్ చౌహాన్ జంటపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సిరిల్ వర్మ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. కార్తీకేయ్ గుల్షన్ కుమార్ 21–17, 15–21, 21–7తో సిరిల్‌ను ఓడించాడు. బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. -
విజేత తనిష్క్
సాక్షి, హైదరాబాద్: ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మామిళ్లపల్లి తనిష్క్ మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తనిష్క్ 17–21, 22– 20, 21–18తో భారత్‌కే చెందిన శిఖా గౌతమ్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 21–15, 17–21, 21–17తో యీ హాన్ చోంగ్ (మలేసియా)పై గెలిచాడు. సింగిల్స్ చాంపియన్స్ తనిష్క్, లక్ష్య సేన్‌లకు 600 డాలర్ల చొప్పున (రూ. 38 వేలు) ప్రైజ్‌మనీ, 2500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా (భారత్) జంట 21–19, 21–15తో ఫ్రాన్సిస్ ఆల్విన్–నందగోపాల్ (భారత్) జోడీని ఓడించి టైటిల్ దక్కించుకుంది. -
శ్రమించి సెమీస్‌కి...
► సైనా ముందంజ ► పోరాడి ఓడిన సింధు ► ఇండియా ఓపెన్ టోర్నీ న్యూఢిల్లీ: ఆద్యంతం అద్భుతంగా పోరాడిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 19-21, 21-14, 21-19తో ఐదో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. గంటా 23 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సైనాకు తన ప్రత్య ర్థి నుంచి గట్టిపోటీనే ఎదురైంది. అయితే డిఫెం డింగ్ చాంపియన్ సైనా కీలకదశలో సంయమనం కోల్పోకుండా ఆడి విజయాన్ని దక్కించుకుంది. మ్యాచ్‌లో పలుమార్లు సైనా ఆధిక్యంలో ఉండటం, ఆ తర్వాత కోల్పోవడం జరిగింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం ఈ హైదరాబాద్ అమ్మాయి ఒకదశలో 11-7తో ముందంజ వేసింది. అయితే సుంగ్ వెంటనే తేరుకొని వరుసగా ఆరు పాయింట్లు సంపాదించింది. దాంతో సైనా 11-13తో వెనుకబడింది. ఈ దశలో సైనా ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా ఆడి 14-14తో స్కోరును సమం చేసింది. స్కోరు 18-18 వద్ద సైనా రెండు పాయింట్లు నెగ్గి 20-18తో విజయానికి చేరువైంది. సుంగ్ మరో పాయింట్ నెగ్గినా, ఆ వెంటనే సైనా సుదీర్ఘంగా సాగిన ర్యాలీలో పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకొని ఊపిరి పీల్చుకుంది. సుంగ్ జీ హున్‌పై సైనాకిది ఆరో విజయం కావడం విశేషం. శనివారం జరిగే సెమీఫైనల్లో మూడో సీడ్ లీ జురుయ్ (చైనా)తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 2-10తో వెనుకబడి ఉంది. 2012 ఇండోనేసియా ఓపెన్‌లో చివరిసారి లీ జురుయ్‌ను ఓడించిన సైనా... ఆ తర్వాత ఈ చైనా ప్లేయర్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడడం గమనార్హం. మరో క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన పీవీ సింధుకు ఓటమి ఎదురైంది. ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21-15, 15-21, 15-21తో ప్రపంచ 15వ ర్యాంకర్ యోన్ బే జు (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. గంటా 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను దక్కించుకున్నా... ఆ తర్వాత అదే జోరును కొనసాగించడంలో విఫలమైంది.