సాక్షి, హైదరాబాద్: ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మామిళ్లపల్లి తనిష్క్ మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తనిష్క్ 17–21, 22– 20, 21–18తో భారత్‌కే చెందిన శిఖా గౌతమ్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 21–15, 17–21, 21–17తో యీ హాన్ చోంగ్ (మలేసియా)పై గెలిచాడు. సింగిల్స్ చాంపియన్స్ తనిష్క్, లక్ష్య సేన్‌లకు 600 డాలర్ల చొప్పున (రూ. 38 వేలు) ప్రైజ్‌మనీ, 2500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా (భారత్) జంట 21–19, 21–15తో ఫ్రాన్సిస్ ఆల్విన్–నందగోపాల్ (భారత్) జోడీని ఓడించి టైటిల్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment