India Open 2022: భారత క్రీడాకారుడు లక్ష్యసేన్ ఇండియా ఓపెన్-2022 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్‌యూను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో లక్ష్యసేన్ లోహ్ కీన్‌యూపై 24-22, 21-17 తేడాతో గెలుపొందాడు. 54 నిమిషాలపాటు సాగిన ఈ గేమ్‌లో వరుస రెండు సెట్‌లలో విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో లక్ష్యసేన్ తన తొలి సూపర్ 500 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ టైటిల్ గెలుచుకున్న మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.
Take a bow for the Men’s Singles champions! 🔥🔥👏
— BAI Media (@BAI_Media) January 16, 2022
🥇: @lakshya_sen
🥈: @reallohkeanyew #YonexSunriseIndiaOpen2022 #IndiaKaregaSmash #Badminton pic.twitter.com/iM9wkpiDLD
ఇండియా ఓపెన్ డబుల్స్ ఫైనల్లో చిరాగ్‌శెట్టి- సాత్విక్ సాయిరాజ్ జోడి మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌లు అయిన ఇండోనేషియాకు చెందిన మహ్మద్ అహ్పాన్, హెండ్రా సెటియావాన్‌లను ఓడించి టైటిల్‌ను గెలుపొందారు. ఫైనల్లో ఈ జోడి వరుస సెట్‌లలో అద్భుతమైన ఆటతీరుతో 21-16, 26-24 తేడాతో గెలుపొందింది.
Put your hands together for the Men’s doubles champions! 🇮🇳 🇮🇩 👏👏🔝
— BAI Media (@BAI_Media) January 16, 2022
🥇: @satwiksairaj & @Shettychirag04
🥈: Mohammad Ahsan & Hendra Setiwan#YonexSunriseIndiaOpen2022 #IndiaKaregaSmash #Badminton pic.twitter.com/hHC4i5ybOE
Comments
Please login to add a commentAdd a comment