విజయానంతరం పీవీ సింధు
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్, భారత టాప్ స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి బియాట్రిజ్ కొరల్స్‌పై 21-12, 19-21, 21-11 తేడాతో సింధు విజయం సాధించింది. ఈ విజయంతో సింధు ఇండియా ఓపెన్ సెమీస్‌లోకి మూడోసారి ప్రవేశించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
తొలి సెట్‌ను అలవోకగా గెల్చిన సింధుకు రెండో సెట్‌లో ప్రత్యర్థి అనూహ్యంగా గట్టిపోటీనిచ్చింది. చివరకు రెండో సెట్‌లో బియాట్రిజ్ కొరల్స్ పై చేయి సాధించడంతో నిర్ణయాత్మక మూడో సెట్ ఆడాల్సి వచ్చింది. తిరిగి పుంజుకున్న సింధు ఈ సెట్‌లో ప్రత్యర్ధికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయ కేతనం ఎగురవేసింది.
Comments
Please login to add a commentAdd a comment