
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
Swiss Open Super 300 badminton tournament- బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అతను 21–10, 21–14తో చియా హా లీ (చైనీస్ తైపీ)ని వరుస గేముల్లో కంగుతినిపించాడు. తద్వారా పదహారు నెలల కాలం తర్వాత తొలిసారి ఓ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టాడు.
ఇక శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో చైనీస్ తైపీ, వరల్డ్ నంబర్ 22 లిన్ చున్ యీని కిడాంబి శ్రీకాంత్ ఎదుర్కోనున్నాడు. అంతకు ముందు పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ శ్రీకాంత్ 21–16, 21–15తో మలేసియన్ టాప్ సీడ్ ప్లేయర్ లీ జీ జియాను వరుస గేముల్లో కంగు తినిపించిన విషయం తెలిసిందే.
పీవీ సింధుకు చుక్కెదురు
మరోవైపు.. రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు, లక్ష్యసేన్‌లకు ప్రి క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. ఏడో సీడ్ లక్ష్యసేన్ 17–21, 15–21తో చియా హా లీ (చైనీస్ తైపీ) జోరుకు నిలువలేకపోయాడు.
మహిళల ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ సింధు 21–16, 19–21, 16–21తో జూనియర్ ప్రపంచ చాంపియన్, 17 ఏళ్ల టొమొకా మియజకి (జపాన్) చేతిలో పరాజయం చవిచూడగా, మహిళల డబుల్స్‌లో 8వ సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట 14–21, 15–21తో సెటియాన–ఎంజెలా యూ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో కంగుతింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–సుమిత్ రెడ్డి జంట 11–21, 14–21తో రాబిన్ టాబెలింగ్–సెలెనా పేక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment