కౌలాలంపూర్: ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన భారత స్టార్ పీవీ సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 21 నుంచి 27 వరకు డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన ‘డ్రా’ కార్యక్రమం గురువారం జరిగింది. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి సింధు మాత్రమే బరిలో ఉంది. 16వ సీడ్‌గా బరిలోకి దిగనున్న సింధుకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.
ఆ తర్వాత సింధుకు ప్రతి రౌండ్‌లో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. రెండో రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడే చాన్స్ ఉంది. మూడో రౌండ్‌లో మరో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) సిద్ధంగా ఉండవచ్చు.
ఈ రెండు అడ్డంకులు దాటితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడే అవకాశముంది. ఆన్ సెయంగ్‌తో ఇప్పటి వరకు సింధు ఆరుసార్లు ఆడగా ఆరుసార్లూ ఓడిపోయింది.
ఇక పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రణయ్, లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీకి... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment