Pv Sindhu: ఫ్రెంచ్ ఓపెన్ 2021 టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కి చెందిన సయాక తకహాషీ చేతిలో 21-18, 16-21, 12-21 తేడాతో సింధు ఒటమి చెందింది. ఈ విజయంతో సయాక తకహాషీ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరింది.
అంతకుముందు పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌పై 21-14, 21-14తో విజయం సాధించి సెమిస్‌లో అడుగు పెట్టింది. కాగా ఇప్పటి వరకు సయాక తకయాషీతో జరిగిన గత 8 మ్యాచుల్లో పీవీ సింధుకి ఇది నాలుగో ఓటమి కావడం విశేషం.
చదవండి: AUS Vs ENG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
Comments
Please login to add a commentAdd a comment