ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా వరల్డ్ నెంబర్ వన్ కార్లెస్ అల్కరాజ్, సెర్బియా స్టాన్ నొవాక్ జొకోవిచ్ మధ్య సెమీఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా కొదమ సింహాల్లా తలపడుతున్నారు. ఇప్పటికైతే తొలి సెట్‌ను జొకోవిచ్ 6-3తో సొంతం చేసుకున్నప్పటికి.. రెండో సెట్‌లో మాత్రం అల్కరాజ్ లీడింగ్‌లో ఉన్నాడు. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌లో గెలుపు ఎవరిది అని చెప్పడం కష్టంగా మారింది.
ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ సందర్భంగా అల్కరాజ్ చేసిన విన్యాసం జొకోవిచ్ చేత చప్పట్లు కొట్టించింది. వరల్డ్ నెంబర్ వన్ అనే పదానికి సార్థకం చేస్తూ అల్కరాజ్ కొట్టిన బ్యాక్ హ్యాండ్ షాట్ చరిత్రలో మిగిలిపోనుంది. విషయంలోకి వెళితే.. రెండోసెట్‌లో భాగంగా ఇద్దరు 1-1తో ఉన్నప్పుడు జొకోవిచ్ కాస్త తెలివిగా ర్యాలీ చేశాడు. అయితే అల్కరాజ్ వేగంగా స్పందించి షాట్ ఆడాడు. కానీ అల్కరాజ్ కోర్టు దగ్గరకు రావడం.. అదే సమయంలో జొకోవిచ్ ఆఫ్‌సైడ్ రిఫ్ట్ షాట్ కొట్టాడు.
ఇక జొకోకు పాయింట్ వచ్చినట్లేనని అంతా భావించారు. కానీ ఇక్కడే అల్కరాజ్ ఎవరు ఊహించని ఫీట్ నమోదు చేశాడు. వేగంగా పరిగెత్తిన అల్కరాజ్ బ్యాక్‌హ్యాండ్ స్ట్రోక్ ఉపయోగించి షాట్ కొట్టాడు. బంతి కూడా లైన్ ఇవతల పడడంతో అల్కరాజ్ పాయింట్ గెలుచుకున్నాడు. అల్కరాజ్ చర్యకు ఆశ్చర్యపోయిన జొకోవిచ్ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Take a bow, @carlosalcaraz 😱#RolandGarros pic.twitter.com/2m25jQtOy1
— Tennis Channel (@TennisChannel) June 9, 2023
😳#RolandGarros
— Wimbledon (@Wimbledon) June 9, 2023
pic.twitter.com/3UA4JbPHz4
చదవండి: 'చాన్స్ కూడా ఇవ్వలేదు'.. సిరాజ్ దెబ్బకు లేచి కూర్చొన్నాడు
Comments
Please login to add a commentAdd a comment