
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో చైనాకు చెందిన చెన్ యు ఫీ చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో అద్భుతమైన పోరాట పటిమ చూపించిన సింధు.. ఆఖరికి 24-22,17-21, 18-21తో పరాజయం చవిచూసింది.
హోరాహోరీగా సాగిన తొలి సెట్‌లో 24-22 తేడాతో చెన్ యు ఫీని ఓడించిన సింధూ.. రెండు, మూడు సెట్లను మాత్రం ప్రత్యర్థికి కోల్పోయింది. రెండు, మూడు సెట్లలో ప్రత్యర్ధి చెన్ యు ఫీ అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఎటువంటి తప్పిదాలు చేయకుండా సెమీస్‌బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడీ 21-19, 21-13తో సుపక్ జొంకో, కెడ్రెన్(థాయ్‌లాండ్) జోడీని ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌ను కష్టంగా గెలిచిన సాత్విక్, చిరాగ్ జంట.. రెండో గేమ్‌ను అలవోకగా దక్కించుకున్నారు. సెమీస్‌లో మిన్ హ్యుక్ కాంగ్, సెయింగ్ జయె(కొరియా) జోడీతో తలపడనున్నారు.
చదవండి: IPL 2024: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం..!?
Comments
Please login to add a commentAdd a comment