జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. సాత్విక్–చిరాగ్ జంట 20–22, 21–23తో కిట్టినపొంగ్ కెడ్రెన్–డెచాపోల్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత నంబర్‌వన్ లక్ష్యసేన్ 16–21, 21–12, 21–23తో నిషిమోటో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తనీషా–అశ్విని జోడీలు ఓటమి పాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment