ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2023లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం వరల్డ్ నెంబర్ వన్.. స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్‌తో జరిగిన సెమీస్ పోరులో జొకోవిచ్ 6-3, 5-7,6-1,6-1తో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో జొకోవిచ్‌ను ప్రతిఘటించిన అల్కరాజ్ తర్వాతి రెండు సెట్లలో అనుభవం ముందు నిలవలేకపోయాడు.
అయితే గేమ్‌లో మాత్రం అల్కరాజ్ తనదైన సర్వీస్ షాట్లతో జొకోవిచ్ మనసును గెలుచుకున్నాడు. ఇక జొకోవిచ్ కెరీర్‌లో 34వ సారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. నాదల్‌తో కలిసి 22 టైటిల్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధించిన ఆటగాడిగా జొకోవిచ్ సంయుక్తంగా ఉన్నాడు.
ఈసారి ఫైనల్లో గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ అందుకుంటే.. ఓపెన్ శకంలో(23 టైటిల్స్) అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కనున్నాడు. మరో సెమీఫైనల్లో కాస్పర్ రూడ్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌ల మధ్య జరగనుంది. ఈ ఇద్దరిలో గెలిచిన ఆటగాడితో జొకోవిచ్ ఆదివారం ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాడు.
Never doubt Novak 💪🇷🇸@DjokerNole gets the better of Alcaraz 6-3, 5-7, 6-1, 6-1 to reach a 34th Grand Slam final.#RolandGarros pic.twitter.com/fefJZKKMxn
— Roland-Garros (@rolandgarros) June 9, 2023
చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్
Comments
Please login to add a commentAdd a comment