టెన్నిస్ దిగ్గజం, వరల్డ్ నంబర్-2 ప్లేయర్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ సింహ గర్జన చేస్తూ, చొక్కా చించుకుని మరీ సంబురాలు చేసుకున్నాడు. సిన్సినాటీ ఓపెన్ ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్‌ను ఓడించిన అనంతరం జకో ఈ తరహా సెలెబ్రేషన్స్‌ను చేసుకున్నాడు. 35 రోజుల కిందట వింబుల్డన్-2023 ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాభవాన్ని గుర్తు చేసుకుంటూ విజయానందంతో ఊగిపోయాడు.
Novak Djokovic beat Carlos Alcaraz in a three-set thriller for his 39th Masters title 😤 pic.twitter.com/b0foTBijs8
— Bleacher Report (@BleacherReport) August 21, 2023
3 గంటల 49 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఫైనల్లో జకోవిచ్.. 5-7, 7-6 (7), 7-6 (4)తేడాతో అల్కరాజ్‌ను మట్టికరిపించి, తన ATP మాస్టర్స్ 1000 టైటిల్స్ సంఖ్యను 39కి పెంచుకున్నాడు. ఈ మ్యాచ్ ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా రికార్డైంది. రోజర్ ఫెదరర్-మార్డీ ఫిష్ మధ్య 2010లో జరిగిన మ్యాచ్ (2 గంటల 49 నిమిషాలు) ఈ మ్యాచ్‌కు ముందు వరకు ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా ఉండింది.
One of the best championship point saves you'll ever see 🙌@carlosalcaraz #CincyTennis pic.twitter.com/AHOogM0mj6
— Tennis TV (@TennisTV) August 20, 2023
ఈ మ్యాచ్‌లో జకోవిచ్, అల్కారాజ్ కొదమ సింహాల్లా పోరాడి అభిమానులకు అసలుసిసలు టెన్నిస్ మజాను అందించారు. ఓ దశలో జకో ఛాంపియన్‌షిప్ పాయింట్ వరకు వచ్చి వెనుకపడి పోయాడు. అయితే ఎట్టకేలకు విజయం జకోనే వరించింది. ఓటమి అనంతరం వరల్డ్ నంబర్ ప్లేయర్ అల్కారాజ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచి వేయగా.. ఇదే సమయంలో జకో విజయగర్వంతో ఊగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment