Wimbledon final
-
చొక్కా చించుకుని సంబురాలు చేసుకున్న జకో.. వెక్కివెక్కి ఏడ్చిన అల్కరాజ్
టెన్నిస్ దిగ్గజం, వరల్డ్ నంబర్-2 ప్లేయర్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ సింహ గర్జన చేస్తూ, చొక్కా చించుకుని మరీ సంబురాలు చేసుకున్నాడు. సిన్సినాటీ ఓపెన్ ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ను ఓడించిన అనంతరం జకో ఈ తరహా సెలెబ్రేషన్స్‌ను చేసుకున్నాడు. 35 రోజుల కిందట వింబుల్డన్-2023 ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాభవాన్ని గుర్తు చేసుకుంటూ విజయానందంతో ఊగిపోయాడు. Novak Djokovic beat Carlos Alcaraz in a three-set thriller for his 39th Masters title 😤 pic.twitter.com/b0foTBijs8 — Bleacher Report (@BleacherReport) August 21, 2023 3 గంటల 49 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఫైనల్లో జకోవిచ్.. 5-7, 7-6 (7), 7-6 (4)తేడాతో అల్కరాజ్ను మట్టికరిపించి, తన ATP మాస్టర్స్ 1000 టైటిల్స్ సంఖ్యను 39కి పెంచుకున్నాడు. ఈ మ్యాచ్ ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా రికార్డైంది. రోజర్ ఫెదరర్-మార్డీ ఫిష్ మధ్య 2010లో జరిగిన మ్యాచ్ (2 గంటల 49 నిమిషాలు) ఈ మ్యాచ్‌కు ముందు వరకు ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా ఉండింది. One of the best championship point saves you'll ever see 🙌@carlosalcaraz #CincyTennis pic.twitter.com/AHOogM0mj6 — Tennis TV (@TennisTV) August 20, 2023 ఈ మ్యాచ్‌లో జకోవిచ్, అల్కారాజ్ కొదమ సింహాల్లా పోరాడి అభిమానులకు అసలుసిసలు టెన్నిస్ మజాను అందించారు. ఓ దశలో జకో ఛాంపియన్షిప్ పాయింట్ వరకు వచ్చి వెనుకపడి పోయాడు. అయితే ఎట్టకేలకు విజయం జకోనే వరించింది. ఓటమి అనంతరం వరల్డ్ నంబర్ ప్లేయర్ అల్కారాజ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచి వేయగా.. ఇదే సమయంలో జకో విజయగర్వంతో ఊగిపోయాడు. -
అల్కరాజ్ గెలుపు కాదు.. ఫెదరర్ ప్రతీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న జకోవిచ్
Wimbledon 2023: నిన్న జరిగిన వింబుల్డన్-2023 ఫైనల్లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్.. స్పానిష్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ రసవత్తర సమరంలో అల్కరాజ్ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్పై నెగ్గాడు. తద్వారా అల్కరాజ్ తొలి వింబుల్డన్ టైటిల్‌ను, ఓవరాల్‌గా రెండో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. Classy words from the seven-time champion. An emotional Novak Djokovic speaks after his #Wimbledon final defeat to Carlos Alcaraz... pic.twitter.com/Lvg980Sbn8 — Wimbledon (@Wimbledon) July 16, 2023 కాగా, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయలేక తరుచూ సహనం కోల్పోయే జకోవిచ్.. తనలో ఎప్పుడూ బయటపడని కొత్త యాంగిల్‌ను వింబుల్డన్ 2023 ఫైనల్ అనంతరం చూపించాడు. ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా తనపై గెలిచిన అల్కరాజ్ను ప్రశంసలతో ముంచెత్తిన జకో.. చాలా సేపు ఆహ్లాదంగా మాట్లాడి, ఆ తర్వాత ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూనే.. తాను 2019లో ఫెదరర్‌పై గెలవాల్సింది కాదని జకో అన్నాడు. అల్కరాజ్ చేతిలో ఓటమిని మైదానంలోని కొందరు ప్రేక్షకులు ఫెదరర్ ప్రతీకారమని అరవడమే జకో కనీళ్లకు కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సెంటర్ కోర్టులో జకోవిచ్‌కు పదేళ్ల తర్వాత ఎదురైన తొలి పరాజయం ఇదే. జులై 7, 2013లో ఆండీ ముర్రే చివరిసారిగా సెంటర్ కోర్టులో జకోవిచ్‌పై గెలిచాడు. ఆతర్వాత ఇన్నాళ్లకు అల్కరాజ్.. సెంటర్ కోర్టులో జకోవిచ్‌పై నెగ్గాడు. మరోవైపు తొలి సెట్ గెలిచి గ్రాండ్‌స్లామ్ ఓడిపోయిన తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. 78 మ్యాచ్‌ల తర్వాత జకోవిచ్.. తొలి సెట్ గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడిపోయాడు. -
జొకోవిచ్‌కు షాక్.. వింబుల్డన్ సరికొత్త విజేత అల్కరాజ్ (ఫొటోలు)
-
Wimbledon 2022: ఎదురులేని జొకోవిచ్
లండన్: మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 2 గంటల 34 నిమిషాల్లో 2–6, 6–3, 6–2, 6–4తో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో అన్‌సీడెడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)తో జొకోవిచ్ తలపడతాడు. తొలి సెమీఫైనల్లో కిరియోస్తో తలపడాల్సిన రాఫెల్ నాదల్ (స్పెయిన్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో కిరియోస్ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ ఫైనల్ ఆడనున్నాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ ఆడిన నోరీ మొదటి సెట్‌ను గెల్చుకోవడంతో సంచలనం నమోదవుతుందా అనే సందేహం కలిగింది. అయితే ఆరుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్ రెండో సెట్ నుంచి పుంజుకున్నాడు. 13 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ నెట్ వద్దకు 32 సార్లు దూసు కొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. జొకోవిచ్ జోరు పెంచడంతో తడబడిన నోరీ మ్యాచ్ మొత్తంలో 36 అనవసర తప్పిదాలు చేశాడు. -
సెరెనా వచ్చేసింది
లండన్: ఏడు సార్లు వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన మాజీ వరల్డ్ నంబర్ వన్, అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. తన ఎనిమిదో టైటిల్ వేటలో ఆమె ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ను ఎదుర్కోనుంది. శనివారం జరిగే తుదిపోరులో వీళ్లిద్దరు తలపడనున్నారు. 2016లో వీరిద్దరి మధ్యే జరిగిన ఫైనల్లో సెరెనా విజేతగా నిలిచింది. ప్రసవానంతరం బరిలోకి దిగిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు ముందే గాయంతో తప్పుకున్న సెరెనా, ఈ సారి పచ్చికపై తన అసలు ఆటను ప్రదర్శిస్తూ ఫైనల్ చేరడం విశేషం. సెమీస్‌లో 25వ సీడ్ సెరెనా 6–2, 6–4తో 13వ సీడ్ జులియా జార్జెస్‌పై అలవోక విజయం సాధించింది. 12 ఏళ్లుగా ఏనాడు ప్రిక్వార్టర్ దశను దాటలేకపోయిన జార్జెస్‌ను అమెరికా టెన్నిస్ దిగ్గజం గంటా 10 నిమిషాల్లో ఇంటిదారి పట్టించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్, ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరిన కెర్బర్ వింబుల్డన్‌లో రెండోసారి ఫైనల్స్‌కు చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 11వ సీడ్ ఏంజెలిక్ కెర్బర్ వరుస సెట్లలో 12వ సీడ్ జెలీనా ఒస్టాపెంకో (లాత్వియా)పై అలవోక విజయం సాధించింది. గంటా 8 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆమె 6–3, 6–3తో ఒస్టాపెంకోను ఇంటిదారి పట్టించింది. అదేపనిగా అనవసర తప్పిదాలు, డబుల్ ఫాల్ట్‌లతో ఒస్టాపెంకో పరాజయం చవిచూసింది. -
ఫెడరర్...కాచుకో
-
ఫెడరర్...కాచుకో
∙ తొలిసారి వింబుల్డన్ ఫైనల్లోకి సిలిచ్ ∙ సెమీస్‌లో సామ్ క్వెరీపై విజయం ∙ రేపు స్విస్ దిగ్గజంతో టైటిల్ పోరు ∙ రెండో సెమీస్‌లో బెర్డిచ్‌పై ఫెడరర్ గెలుపు ఏమాత్రం అంచనాలు లేకుండా వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన క్రొయేషియా ఆజానుబాహుడు మారిన్ సిలిచ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అంతిమ సమరానికి చేరుకున్నాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 89 కేజీల బరువున్న సిలిచ్ తన 11వ ప్రయత్నంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రూపంలో సిలిచ్‌కు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. తన కెరీర్లోనే అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న ఫెడరర్ సెమీఫైనల్లో థామస్ బెర్డిచ్ను వరుస సెట్లలో ఓడించాడు. 11వ సారి వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరిన ఫెడరర్ రికార్డుస్థాయిలో ఎనిమిదో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. లండన్: ఎవరూ ఊహించని విధంగా క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్ వింబుల్డన్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఏడో సీడ్ సిలిచ్ 6–7 (6/8), 6–4, 7–6 (7/3), 7–5తో 24వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా)పై గెలిచాడు. 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బుల్లెట్‌లాంటి సర్వీస్‌లు, పదునైన రిటర్న్‌లతో అలరించాడు. అందివచ్చిన అవకాశాలను అనుకూలంగా మల్చుకొని తన కెరీర్లో రెండోసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు అర్హత పొందాడు. 2001లో గొరాన్ ఇవానిసెవిచ్ తర్వాత క్రొయేషియా నుంచి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన రెండో క్రీడాకారుడిగా సిలిచ్ గుర్తింపు పొందాడు. 2014లో యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సిలిచ్ తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టాడు. ‘నమ్మశక్యంగా లేదు. ఈ టోర్నీ ఆరంభం నుంచి నేను అద్భుతంగా ఆడాను. ఫెడరర్‌కు వింబుల్డన్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. అయితేనేం అతనితో పోరుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అతని సవాల్‌కు సిద్ధంగా ఉన్నాను’ అని సిలిచ్ వ్యాఖ్యానించాడు. ఎదురులేని ఫెడరర్... రెండో సెమీఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 7–6 (7/4), 7–6 (7/4), 6–4తో 11వ సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. 2 గంటల 18 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ తొలి రెండు సెట్లను టైబ్రేక్‌లో గెలిచాడు. మూడో సెట్లో ఒకసారి బెర్డిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి... ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్ చేరే క్రమంలో ఫెడరర్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. బోపన్న జంట ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) జంట నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–దబ్రౌస్కీ ద్వయం 7–6 (7/4), 4–6, 5–7తో హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–హీతెర్ వాట్సన్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడింది. ముగురుజా (vs) వీనస్ ఆరోసారి టైటిల్ సాధించాలని వీనస్ విలియమ్స్... తొలిసారి విజేతగా నిలవాలని ముగురుజా... వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో అమీతుమీకి సిద్ధమయ్యారు. నేడు జరిగే ఫైనల్లో వీనస్ గెలిస్తే పెద్ద వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. ముగురుజా నెగ్గితే 1994 తర్వాత ఈ టైటిల్‌ను గెలిచిన తొలి స్పెయిన్ క్రీడాకారిణిగా ఘనత వహిస్తుంది. ముఖాముఖి రికార్డులో వీనస్ 3–1తో ముగురుజాపై ఆధిక్యంలో ఉంది. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
వీనస్ (Vs) ముగురుజా
-
ఫైనల్లో క్విటోవా, బౌచర్డ్
సెమీస్‌లో పేస్ జోడి మిక్స్‌డ్‌లో సానియా ద్వయం ఓటమి లండన్: మూడేళ్ల తర్వాత మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా... వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో 6వ సీడ్ క్విటోవా (చెక్) 7-6 (8/6), 6-1తో 23వ సీడ్ లూసి సఫరోవా (చెక్)పై విజయం సాధించింది. 80 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 24 విన్నర్స్, 8 ఏస్‌లతో ప్రత్యర్థిని వణికించింది. బలమైన గ్రౌండ్ స్ట్రోక్‌లను సంధిస్తూ బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో తొలి గేమ్‌లో సఫరోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అయితే వెంటనే తేరుకున్న సఫరోవా నాలుగో గేమ్‌లో క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌లో నిలిచింది. టైబ్రేక్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన క్విటోవా తొలి సెట్ పాయింట్‌ను చేజార్చుకున్నా... ఈ అవకాశాన్ని సఫరోవా సద్వినియోగం చేసుకోలేకపోయింది. చివరకు బలమైన విన్నర్‌తో ఆరోసీడ్ ప్లేయర్ సెట్‌ను ముగించింది. రెండోసెట్ రెండో గేమ్‌లో సర్వీస్‌ను బ్రేక్ చేసిన క్విటోవా ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడింది. ఆరో గేమ్‌లో బ్రేక్ పాయింట్‌ను కాపాడుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో సెమీస్‌లో 13వ సీడ్ ఎగుని బౌచర్డ్ (కెనడా) 7-6 (5), 6-2తో 3వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచింది. తద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొలి కెనడా మహిళా ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. గంటా 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని విజయం సాధించింది. రెండోసెట్లో బ్రేక్ పాయింట్ వద్ద హలెప్ డబుల్ ఫాల్ట్ చేయడం బౌచర్డ్‌కు కలిసొచ్చింది. సెమీస్‌లో పేస్ జోడి పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో ఐదోసీడ్ లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్) జోడి 3-6, 7-6 (5), 6-3, 6-4తో మూడోసీడ్ నెస్టర్ (కెనడా)-జిమోన్జిక్ (సెర్బియా)పై నెగ్గి సెమీస్‌కి చేరింది. మిక్స్డ్ డబుల్స్ మూడో రౌండ్లో సానియా మీర్జా (భారత్)-టెకాయు (రొమేనియా) ద్వయం 5-7, 3-6తో జెమీ ముర్రే (బ్రిటన్)-డెల్లాక్వా (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది.