న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు జరిగే ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ‘డ్రా’ను నిర్వాహకులు గురువారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్ తన తొలి మ్యాచ్‌ను హైదరాబాద్‌కు చెందిన సిరిల్ వర్మ (భారత్)తో ఆడతాడు. సెమీఫైనల్ వరకు చేరుకోవడం శ్రీకాంత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే సెమీఫైనల్లో శ్రీకాంత్‌కు ప్రపంచ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్) ఎదురవుతాడు.
స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో లో కీన్ యు చేతిలోనే శ్రీకాంత్ ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. మరో భారత షట్లర్ సాయిప్రణీత్ తన తొలి మ్యాచ్‌లో లూయిస్ ఎన్రిక్ (స్పెయిన్)తో ఆడనున్నాడు. మహిళల విభాగంలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్న తెలుగు తేజం పీవీ సింధుకు సులువైన ‘డ్రా’ లభించింది. భారత్‌కే చెందిన శ్రీ కృష్ణప్రియతో సింధు తన తొలి మ్యాచ్ ను ఆడుతుంది. ఈ ఏడాది మొత్తం గాయాలతో ఇబ్బంది పడ్డ సైనా నెహ్వాల్... ఆరంభ మ్యాచ్‌లో ఐరిస్ వాంగ్ (అమెరికా)తో ఆడుతుంది.
చదవండి: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ బోణీ.. 16 పాయింట్లతో మెరిసిన నవీన్
Comments
Please login to add a commentAdd a comment