![Saurav Ghosal rallies to down Nicolas Mueller for Indian Open squash title - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/12/SAURAV-GHOSHAL.jpg.webp?itok=T_jcUu2W)
సౌరవ్ ఘోషల్
ముంబై: భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సౌరవ్ 11–9, 5–11, 6–11, 11–7, 12–10తో నికోలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. నిర్ణాయక ఐదో గేమ్‌లో సౌరవ్ 3–7తో, 5–8 తో, 8–10తో వెనుకబడి... ఆ తర్వాత పుంజుకొని వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 12–10తో ఐదో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment