మేరీకోమ్,శ్యామ్‌కుమార్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత బాక్సర్లు తమ పంచ్ పవర్ చాటుకున్నారు. గురువారం ముగిసిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో మన బాక్సర్లు మొత్తం 18 కేటగిరీలలో కలిపి 8 స్వర్ణాలు, 10 రజతాలు, 23 కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో మేరీకోమ్ (48 కేజీలు), మనీషా (54 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), ప్విలావో బసుమతిరి (64 కేజీలు)... పురుషుల విభాగంలో సంజీత్ (91 కేజీలు), అమిత్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) స్వర్ణ పతకాలను గెలుపొందారు. పురుషుల 49 కేజీల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్ 0–5తో భారత్‌కే చెందిన అమిత్ చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు.
56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. 48 కేజీల విభాగం ఫైనల్లో మేరీకోమ్ 4–1తో జోసీ గబుకో (ఫిలిప్పీన్స్)ను ఓడించింది. మహిళల విభాగంలో సోనియా (57 కేజీలు), మీనా కుమారి (54 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు), పూజ (69 కేజీలు), సరితా దేవి (60 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలు గెల్చుకున్నారు. పురుషుల విభాగంలో దినేశ్ (69 కేజీలు), దేవాన్‡్ష జైస్వాల్ (81 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), సల్మాన్ షేక్ (52 కేజీలు) రజత పతకాలు గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment