నేడు కొరియాతో మ్యాచ్
గెలిస్తేనే నాకౌట్ దశకు అర్హత
డాంగ్వాన్ (చైనా) : సుదిర్మన్ కప్ బ్యాడ్మిం టన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో... మూడుసార్లు విజేత దక్షిణ కొరియాతో భారత జట్టు నేడు అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్1-డిలో భాగంగా జరిగే ఈ లీగ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ గ్రూప్ నుంచి రెండో జట్టుగా క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత పొందుతుంది. ఇదే గ్రూప్ నుంచి మలేసియా తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
కొరియా జట్టులో ఐదు విభాగాల్లోనూ (పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్) స్టార్ ఆటగాళ్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో భారత్ నెగ్గాలంటే అత్యద్భుత ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 5వ ర్యాంకర్ వాన్ హో సన్‌తో ప్రపంచ 4వ ర్యాంకర్ శ్రీకాంత్... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 7వ ర్యాంకర్ సుంగ్ జీ హున్‌తో ప్రపంచ 2వ ర్యాంకర్ సైనా తలపడే అవకాశముంది.
భారత్‌కు తాడోపేడో
Published Wed, May 13 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM
Advertisement
Advertisement