Sudirman Cup badminton mixed team championship
-
Sudirman Cup: విజయంతో ముగింపు
వాంటా (ఫిన్లాండ్): సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను భారత జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఫిన్లాండ్ను ఓడించింది. థాయ్‌లాండ్, చైనాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయింది. ఫిన్లాండ్తో మ్యాచ్ లో భారత ఆటగాళ్లు పైచేయి సాధించారు. పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 16–21, 21–14, 21–11తో కాలీ కొల్జోనన్‌ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ లో అశ్విని–అర్జున్; పురుషుల డబుల్స్‌లో అర్జున్–ధ్రువ్ కపిల; మహిళల డబుల్స్‌లో తనీషా–రితూపర్ణ జోడీలు, మహిళల సింగిల్స్‌లో మాళవిక విజయాలు నమోదు చేశారు. -
సుదిర్మన్ కప్ చిరాగ్–సాత్విక్ జోడి ఔట్!
Chirag Satwik Pair Withdraws From Sudirman Cup: భారత బ్యాడ్మింటన్ టాప్ పురుషుల డబుల్స్ జంట చిరాగ్ శెట్టి – సాత్విటక్ సాయిరాజ్ అనారోగ్య సమస్యలతో ఆదివారంనుంచి జరిగే సుదిర్మన్ కప్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వరల్డ్ నంబర్ 10 జోడీ అయిన వీరిలో చిరాగ్ అనారోగ్యంగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధికారి ఒకరు వెల్లడించారు. చదవండి: సన్‌రైజర్స్ అవుట్! -
భారత్‌కు తాడోపేడో
నేడు కొరియాతో మ్యాచ్ గెలిస్తేనే నాకౌట్ దశకు అర్హత డాంగ్వాన్ (చైనా) : సుదిర్మన్ కప్ బ్యాడ్మిం టన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో... మూడుసార్లు విజేత దక్షిణ కొరియాతో భారత జట్టు నేడు అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్1-డిలో భాగంగా జరిగే ఈ లీగ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ గ్రూప్ నుంచి రెండో జట్టుగా క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత పొందుతుంది. ఇదే గ్రూప్ నుంచి మలేసియా తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కొరియా జట్టులో ఐదు విభాగాల్లోనూ (పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) స్టార్ ఆటగాళ్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో భారత్ నెగ్గాలంటే అత్యద్భుత ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 5వ ర్యాంకర్ వాన్ హో సన్తో ప్రపంచ 4వ ర్యాంకర్ శ్రీకాంత్... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 7వ ర్యాంకర్ సుంగ్ జీ హున్‌తో ప్రపంచ 2వ ర్యాంకర్ సైనా తలపడే అవకాశముంది.