వాంటా (ఫిన్లాండ్): సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను భారత జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఫిన్లాండ్‌ను ఓడించింది. థాయ్‌లాండ్, చైనాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయింది. ఫిన్లాండ్‌తో మ్యాచ్ లో భారత ఆటగాళ్లు పైచేయి సాధించారు. పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 16–21, 21–14, 21–11తో కాలీ కొల్జోనన్‌ను ఓడించాడు. మిక్స్‌డ్ డబుల్స్ లో అశ్విని–అర్జున్; పురుషుల డబుల్స్‌లో అర్జున్–ధ్రువ్ కపిల; మహిళల డబుల్స్‌లో తనీషా–రితూపర్ణ జోడీలు, మహిళల సింగిల్స్‌లో మాళవిక విజయాలు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment