
ఫిన్లాండ్ ప్రంపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా వరుసగా ఆరోసారి ఈ ఘనత సొంతం చేసుకుంది. అత్యంత సంతోషంగా ఉండే దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. వాస్తవానికి ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్స్ ప్రచురిస్తుంది. దీన్ని150కి పైగా దేశాలలో ప్రజల నుంచి వచ్చిన ప్రపంచ సర్వే ఆధారంగా రూపొందిస్తుంది. మార్చి 20 ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి వార్షిక హ్యాపినెస్ సూచీ ప్రకారం..డెన్మార్క్ అత్యంత సంతోషకరమైన దేశంగా రెండో స్థానంలో ఉండగా, ఐస్‌లాండ్ మూడో స్థానంలో ఉంది.
ఇక వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ నివేదికలో నేపాల్, చైనా, శ్రీలంకల కంటే దిగువున 126వ స్థానంలో ఉంది. ఐతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా హ్యాపినెస్ నివేదికలో వాటి ర్యాంకులు దారుణంగా పడిపోయాయి. రష్యా 72వ స్థానంలో ఉండగా, ఉక్రెయిన్ 92వ స్థానంలో ఉంది. కాగా, ఒక దేశ హ్యాపినెస్‌ని దాని తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవన విధానం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి తదితరాల ఆధారంగా కొలిచి హ్యాపినెస్ సూచీలో స్థానం కల్పిస్తారు. ఐతే అనుహ్యంగా 2021లో ఇతరుల పట్ల దయ చూపడం, ముఖ్యంగా అపరిచితుల సహాయం చేయడం వంటివి పెరిగాయి. ఇది 2022లో మరింత ఎక్కువ పెరిగినట్లు యూఎన్ సస్టైనబుల్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ పేర్కొంది.
(చదవండి: కొడుకు కళ్లఎదుటే కన్న తల్లిపై కుక్కల దాడి..సాయం కోసం వెళ్లేలోపే..)
Comments
Please login to add a commentAdd a comment